AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinking Water At Night: నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా? ఐతే ఇది మీకు చెప్పాల్సిందే..

నేటి జీవనశైలిలో చాలా మంది వేళాపాళాలేని అలవాట్లు ఆచరిస్తున్నారు. ఇందులో నిద్రపోయే ముందు నీళ్లు లేదా ఇతర ద్రవ పానీయాలు తీసుకునే అలవాటు ఒకటి. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుందని కొందరు భావిస్తుంటారు. నిజానికి ఇది రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకు కారణమై, నిద్రకు భంగం కలిగిస్తుంది..

Drinking Water At Night: నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా? ఐతే ఇది మీకు చెప్పాల్సిందే..
Drink Water Before Bed
Srilakshmi C
|

Updated on: May 19, 2026 | 12:41 PM

Share

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రిపూట తీసుకునే ద్రవ పదార్థాల పరిమాణం శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచుకోవడం అవసరమే అయినప్పటికీ రాత్రిపూట అధికంగా నీళ్లు వంటి ఇతర పానీయాలు తీసుకోవడం అందరికీ సరిపడదు. ముఖ్యంగా అధికంగా టీ, కాఫీ లేదా కెఫిన్ వంటి పానీయాలు తాగడం నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. అందువల్ల నిద్రపోయే ముందు ద్రవ పదార్ధాలు ఎంత పరిమాణంలో తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

పడుకునే ముందు ఎంత నీళ్లు తాగాలి?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిద్రపోయే ముందు సుమారు 100 నుంచి 200 మిల్లీలీటర్ల నీరు లేదా ఇతర ద్రవపదార్థాలు తాగడం సాధారణంగా సురక్షితం. ఈ పరిమాణం శరీరంలో నీటి సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేసే అవకాశాన్ని తగ్గిస్తుంది. కానీ ఇది ఒక్కొక్కరి శరీర పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. వైద్యులు చెప్పేదేమిటంటే మీరు రోజంతా తగినంత నీళ్లు తాగితే రాత్రిపూట ఎక్కువ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు.

ఎక్కువగా నీరు తాగితే ఏమవుతుంది?

రాత్రిపూట ఎక్కువగా నీళ్లు లేదా ఇతర పానీయాలు తాగడం తరచుగా నిద్రకు భంగం కలిగిస్తుంది. దీనివల్ల ఉదయం అలసట, ఏకాగ్రత లోపం, తలనొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. కొంతమందికి కడుపు ఉబ్బరం, అసౌకర్యం కూడా కలుగుతుంది. మూత్రపిండాలు, గుండె లేదా మూత్రాశయ సమస్యలు ఉన్నవారు నిద్రపోయే ముందు నీళ్లు లేదా ఇతర పానీయాలు తాగేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు, రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేసేవారు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యంగా ఉండటానికి ఇలా చేయండి..

  • నిద్రపోయే ముందు ఒక గంట ముందు ఎక్కువగా నీళ్లు తాగడం మానుకోవాలి.
  • రాత్రిపూట కెఫిన్ కలిగిన పానీయాల వాడకాన్ని తగ్గించాలి.
  • రోజంతా తగినంత నీళ్లు తాగే అలవాటును పెంపొందించుకోవాలి.
  • నిద్ర సమస్యలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి.

నోట్‌: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
రెండో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం!
రెండో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం!
శుభ ఘడియలు వచ్చేశాయి.. ఈ రాశుల వారికి ఆరు నెలల పాటు లక్కే లక్కు!
శుభ ఘడియలు వచ్చేశాయి.. ఈ రాశుల వారికి ఆరు నెలల పాటు లక్కే లక్కు!
రుచిగా ఉన్నాయని వీటిని అదేపనిగా తింటే.. ఆస్తమా, క్యాన్సర్ ఇంకా..
రుచిగా ఉన్నాయని వీటిని అదేపనిగా తింటే.. ఆస్తమా, క్యాన్సర్ ఇంకా..
అతి తక్కువ ధరతోనే రూ.365 రోజుల వ్యాలిడిటీ.. మతిపోగొట్టే ప్లాన్
అతి తక్కువ ధరతోనే రూ.365 రోజుల వ్యాలిడిటీ.. మతిపోగొట్టే ప్లాన్
బావి కాదు.. డీజిల్ గని! నిప్పు పెడితే భగ్గుమంటున్న జలం!
బావి కాదు.. డీజిల్ గని! నిప్పు పెడితే భగ్గుమంటున్న జలం!
తమ్ముడు సినిమాలో ఈ గ్లామరస్ బ్యూటీ గుర్తుందా ?
తమ్ముడు సినిమాలో ఈ గ్లామరస్ బ్యూటీ గుర్తుందా ?
తరచుగా మూత్రవిసర్జన డయాబెటీస్ లక్షణం అనుకుంటే తప్పులో కాలేసినట్లే
తరచుగా మూత్రవిసర్జన డయాబెటీస్ లక్షణం అనుకుంటే తప్పులో కాలేసినట్లే
సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌ అవుట్
సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌ అవుట్
ఫ్రెండువని నమ్మింది కదరా.. టీ తాగుదామని కార్లో తీసుకెళ్లి..
ఫ్రెండువని నమ్మింది కదరా.. టీ తాగుదామని కార్లో తీసుకెళ్లి..
నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?
నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?