AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK : సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌ అవుట్.. రేసులోకి ఎంట్రీ ఇచ్చిన చెటా ?

CSK : వరుసగా మూడో సీజన్‌లోనూ చెన్నై మేనేజ్‌మెంట్‌కు నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో, జట్టులో నాయకత్వ మార్పు పై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్య బాధ్యతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

CSK : సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి  రుతురాజ్‌ గైక్వాడ్‌ అవుట్.. రేసులోకి ఎంట్రీ ఇచ్చిన చెటా  ?
Ruturaj Gaikwad
Rakesh
|

Updated on: May 19, 2026 | 12:48 PM

Share

CSK : ఐపీఎల్ 2026 సీజన్ ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు అస్సలు కలిసిరావడం లేదు. సోమవారం ఉప్పల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరిగిన చివరి హోమ్ మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో సీఎస్‌కే ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు గాల్లో దీపంగా మారాయి. వరుసగా మూడో సీజన్‌లోనూ చెన్నై మేనేజ్‌మెంట్‌కు నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో, జట్టులో నాయకత్వ మార్పుపై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్య బాధ్యతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఎంఎస్ ధోనీ లాంటి దిగ్గజ కెప్టెన్ వారసత్వాన్ని అందుకోవడంలో రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌లో పూర్తిగా తడబడ్డాడు. అతని బ్యాటింగ్ ఫామ్ జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో రుతురాజ్ కేవలం 29.18 సగటుతో 321 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం రెండే హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టి20 క్రికెట్‌లో టాప్ ఆర్డర్ బ్యాటర్‌కు ఉండాల్సిన వేగం కాకుండా.. 120.68 అతి తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడటంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బౌండరీలు కొట్టడానికి ఇబ్బంది పడుతున్న రుతురాజ్.. ఒత్తిడి వల్ల కెప్టెన్సీలోనూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిస్థితిపై కోల్‌కతా నైట్ రైడర్స్‌తో 2012లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ క్రిక్‌బజ్ టాక్ షోలో ఘాటుగా స్పందించాడు. “రుతురాజ్ గైక్వాడ్.. ధోనీ వదిలేసిన స్థానాన్ని భర్తీ చేయాలని అందరూ అంటున్నారు. కానీ నా ఉద్దేశంలో అంత పెద్ద సైజు షూస్ మార్కెట్లో ఎక్కడా లేవు. రుతురాజ్ పాత మ్యాచ్‌లను రివ్యూ చేసుకుని, తన తప్పులను సరిదిద్దుకుని సొంతంగా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి. కెప్టెన్ అనేవాడు ముందుగా తను పరుగులు చేస్తేనే జట్టులో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కానీ రుతురాజ్‌లో ఆ ఫామ్ పూర్తిగా లోపించింది” అని తివారీ విశ్లేషించాడు. అలాగే ధోనీ లేకపోయినా సీఎస్‌కే మ్యాచ్‌లు గెలవగలదని ఈ సీజన్ నిరూపించిందని, అయితే జట్టు భవిష్యత్తు కోసం కొత్త లీడర్‌ను వెతుక్కోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాడు.

ఈ చర్చలో భాగంగా మనోజ్ తివారీ ఒక క్రేజీ బాంబ్ పేల్చాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి మలయాళీ స్టార్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపాడు. “రాజస్థాన్ రాయల్స్ జట్టును విజయవంతంగా నడిపించి, ఫైనల్ వరకు తీసుకెళ్లిన అనుభవం సంజూ శాంసన్‌కు ఉంది. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ రుతురాజ్‌కు రెండు సీజన్ల పాటు పూర్తి అవకాశం ఇచ్చింది. అయినా ఫలితం రాలేదు. కాబట్టి వచ్చే ఏడాది సంజూ శాంసన్‌ను కెప్టెన్ చేయడమే సీఎస్‌కేకు అత్యంత ప్రయోజనకరం” అని తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం చెన్నై జట్టులోనే ఉన్న సంజూను ఒక ప్రత్యేక ప్లాన్‌తోనే ఫ్రాంచైజీ జట్టులోకి తెచ్చుకుందని హింట్ ఇచ్చాడు.

సన్‌రైజర్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, టెక్నికల్‌గా సీఎస్‌కే ఇంకా ఐపీఎల్ రేసు నుంచి పూర్తిగా అవుట్ కాలేదు. కానీ వారి ప్లేఆఫ్స్ అవకాశాలు కేవలం 6 శాతానికి పడిపోయాయి. మే 21న గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే తమ చివరి మ్యాచ్‌లో చెన్నై భారీ రన్ రేట్‌తో విజయం సాధించాల్సి ఉంటుంది. దాంతో పాటు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగే ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై కూడా చెన్నై బతుకుదెరువు ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఈ సీజన్ ముగిశాక సీఎస్‌కే టీమ్‌లో పెద్ద ఎత్తున మార్పులు జరగడం మాత్రం పక్కాగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌ అవుట్
సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌ అవుట్
ఫ్రెండువని నమ్మింది కదరా.. టీ తాగుదామని కార్లో తీసుకెళ్లి..
ఫ్రెండువని నమ్మింది కదరా.. టీ తాగుదామని కార్లో తీసుకెళ్లి..
నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?
నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?
గుజరాత్‌తో చెన్నై ఫైనల్ మ్యాచ్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి ధోని
గుజరాత్‌తో చెన్నై ఫైనల్ మ్యాచ్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి ధోని
ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సురేష్ రైనా బిగ్ లీక్
ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సురేష్ రైనా బిగ్ లీక్
ఆందోళన వద్దు.. ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
ఆందోళన వద్దు.. ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
ధైర్యం తోడుగా.. మూసీ నుంచి సురక్షితంగా బయటపడ్డ మహిళ!
ధైర్యం తోడుగా.. మూసీ నుంచి సురక్షితంగా బయటపడ్డ మహిళ!
ఫ్రీ మండీ అంటూ ఆఫర్ పెట్టారు.. తీరా కస్టమర్స్ వచ్చాక.. ఏం చేశారో
ఫ్రీ మండీ అంటూ ఆఫర్ పెట్టారు.. తీరా కస్టమర్స్ వచ్చాక.. ఏం చేశారో
ఒకప్పుడు ఫినాయిల్, యాసిడ్ బాటిల్స్ అమ్మాడు.. ఇప్పుడు జబర్దస్త్‌లో
ఒకప్పుడు ఫినాయిల్, యాసిడ్ బాటిల్స్ అమ్మాడు.. ఇప్పుడు జబర్దస్త్‌లో