AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఫ్రెండువని నమ్మింది కదరా.. టీ తాగుదామని కార్లో తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. రెండ్రోజులకే

హైదరాబాద్‌ శివారులో దారుణ ఘటన వెలుగు చూసింది. టీ తాగుదామని కారులో తీసుకెళ్లి ఓ బీటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేవలం 72 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Hyderabad: ఫ్రెండువని నమ్మింది కదరా.. టీ తాగుదామని కార్లో తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. రెండ్రోజులకే
Hyderabad Assualt Case
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: May 19, 2026 | 12:46 PM

Share

సహాధ్యాయి అని నమ్మి కారు ఎక్కిన ఒక బీటెక్ విద్యార్థినిపై సహ విద్యార్థి నమ్మకద్రోహానికి పాల్పడి, బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి ఒడిగట్టిన ఘోర ఉదంతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అత్యంత వేగంగా స్పందించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఏరియాలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బాధిత యువతి, ఉడతల ఉదయ్ అనే యువకుడు ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. ఒకే క్లాస్ కావడంతో వీరిద్దరికీ గత కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే మే 14వ తేదీ రాత్రి సమయంలో నిందితుడు ఉదయ్, ‘టీ తాగి వద్దాం’ అని నమ్మించి బాధితురాలిని ఆమె ఉంటున్న రూం వద్ద నుండి తన కారులో ఎక్కించుకున్నాడు.

అక్కడి నుండి దిల్ సుఖ్ నగర్ ఏరియా అంతా కారులో తిప్పిన నిందితుడు, తిరిగి ఇబ్రహీంపట్నం వైపు వస్తూ మార్గమధ్యంలో మద్యం కొనుగోలు చేశాడు. అనంతరం ఇబ్రహీంపట్నంలోని బీడీఎల్ (BDL) రోడ్డు వైపు కారును తీసుకెళ్లి, అక్కడ బాధితురాలికి బలవంతంగా మద్యం తాగించాడు. తను కూడా మద్యం సేవించిన అనంతరం, మత్తులో స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న యువతిని ఇబ్రహీంపట్నంలోని ఒక రూమ్‌కు తీసుకెళ్లి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలు మరుసటి రోజు (మే 15న) ధైర్యంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తక్షణమే స్పందించారు. సిఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, ఘటన జరిగిన మూడు రోజుల్లోనే నిందితుడు ఉడతల ఉదయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఫ్రెండువని నమ్మింది కదరా.. టీ తాగుదామని కార్లో తీసుకెళ్లి..
ఫ్రెండువని నమ్మింది కదరా.. టీ తాగుదామని కార్లో తీసుకెళ్లి..
నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?
నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?
గుజరాత్‌తో చెన్నై ఫైనల్ మ్యాచ్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి ధోని
గుజరాత్‌తో చెన్నై ఫైనల్ మ్యాచ్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి ధోని
ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సురేష్ రైనా బిగ్ లీక్
ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సురేష్ రైనా బిగ్ లీక్
ఆందోళన వద్దు.. ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
ఆందోళన వద్దు.. ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
ధైర్యం తోడుగా.. మూసీ నుంచి సురక్షితంగా బయటపడ్డ మహిళ!
ధైర్యం తోడుగా.. మూసీ నుంచి సురక్షితంగా బయటపడ్డ మహిళ!
ఫ్రీ మండీ అంటూ ఆఫర్ పెట్టారు.. తీరా కస్టమర్స్ వచ్చాక.. ఏం చేశారో
ఫ్రీ మండీ అంటూ ఆఫర్ పెట్టారు.. తీరా కస్టమర్స్ వచ్చాక.. ఏం చేశారో
ఒకప్పుడు ఫినాయిల్, యాసిడ్ బాటిల్స్ అమ్మాడు.. ఇప్పుడు జబర్దస్త్‌లో
ఒకప్పుడు ఫినాయిల్, యాసిడ్ బాటిల్స్ అమ్మాడు.. ఇప్పుడు జబర్దస్త్‌లో
బాతుల పెంపకంతో నెలకు లక్షల్లో సంపాదన..
బాతుల పెంపకంతో నెలకు లక్షల్లో సంపాదన..