AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urine Infections: తరచుగా మూత్రవిసర్జన డయాబెటీస్‌ లక్షణం అనుకుంటే పొరబాటే.. నిర్లక్ష్యం చేస్తే మీ కిడ్నీలు మటాష్‌!

మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ సాధారణ ఆరోగ్య సమస్య అయినప్పటికీ.. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ప్రారంభంలో ఇది మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం, తరచుగా మూత్రవిసర్జన చేయడం వంటి లక్షణాలతో కనిపించినప్పటికీ ఇన్ఫెక్షన్ ముదిరితే మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది..

Urine Infections: తరచుగా మూత్రవిసర్జన డయాబెటీస్‌ లక్షణం అనుకుంటే పొరబాటే.. నిర్లక్ష్యం చేస్తే మీ కిడ్నీలు మటాష్‌!
Causes Of Urinary Infection
Srilakshmi C
|

Updated on: May 19, 2026 | 12:53 PM

Share

నిపుణుల అభిప్రాయం ప్రకారం మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ సాధారణంగా E. coli బాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా మూత్ర నాళం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, తక్కువ నీళ్లు తాగడం, అపరిశుభ్రమైన టాయిలెట్లను ఉపయోగించడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వంటివి ఈ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి ఈ సమస్య ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం..

మూత్ర ఇన్ఫెక్షన్ ఎప్పుడు ప్రమాదకరం?

ఇన్‌ఫెక్షన్ మూత్రాశయానికే పరిమితమైతే అది సాధారణంగా తీవ్రమైన సమస్య కాదు. అయితే అది మూత్రపిండాలకు వ్యాపిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ ఎక్కువ కాలం కొనసాగితే మూత్రపిండాల పనితీరు క్షీణించే ప్రమాదం ఉంది. మీకు అధిక జ్వరం, చలి, వాంతులు, మూత్రంలో రక్తం, నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

దీని లక్షణాలు ఏమిటి?

  • మూత్రవిసర్జన సమయంలో మంటగా అనిపించడం
  • తరచుగా మూత్రవిసర్జన చేయాలని అనిపించడం
  • తక్కువ మూత్రవిసర్జన
  • మూత్రం నుంచి దుర్వాసన వస్తుంది
  • పొత్తికడుపులో నొప్పి

దీనివల్ల ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది?

  • వృద్ధులు
  • మధుమేహ రోగులు
  • గర్భిణీలు
  • రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు

దీని ఎలా రక్షించుకోవాలి?

తగినంత నీళ్లు తాగడం, ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకోకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. వైద్యుని సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
తరచుగా మూత్రవిసర్జన డయాబెటీస్ లక్షణం అనుకుంటే తప్పులో కాలేసినట్లే
తరచుగా మూత్రవిసర్జన డయాబెటీస్ లక్షణం అనుకుంటే తప్పులో కాలేసినట్లే
సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌ అవుట్
సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌ అవుట్
ఫ్రెండువని నమ్మింది కదరా.. టీ తాగుదామని కార్లో తీసుకెళ్లి..
ఫ్రెండువని నమ్మింది కదరా.. టీ తాగుదామని కార్లో తీసుకెళ్లి..
నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?
నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?
గుజరాత్‌తో చెన్నై ఫైనల్ మ్యాచ్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి ధోని
గుజరాత్‌తో చెన్నై ఫైనల్ మ్యాచ్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి ధోని
ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సురేష్ రైనా బిగ్ లీక్
ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సురేష్ రైనా బిగ్ లీక్
ఆందోళన వద్దు.. ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
ఆందోళన వద్దు.. ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
ధైర్యం తోడుగా.. మూసీ నుంచి సురక్షితంగా బయటపడ్డ మహిళ!
ధైర్యం తోడుగా.. మూసీ నుంచి సురక్షితంగా బయటపడ్డ మహిళ!
ఫ్రీ మండీ అంటూ ఆఫర్ పెట్టారు.. తీరా కస్టమర్స్ వచ్చాక.. ఏం చేశారో
ఫ్రీ మండీ అంటూ ఆఫర్ పెట్టారు.. తీరా కస్టమర్స్ వచ్చాక.. ఏం చేశారో