పుల్వామా దాడి జరిగే కొద్ది క్షణాల ముందు.. ఓ జవాన్ తీసిన వీడియో..

పంజాబ్ : పుల్వామా ఉగ్రదాడి జరిగే కొద్ది క్షణాల బస్సులోంచి ఓ జవాన్ తీసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాన్వాయ్‌పై కారు బాంబుతో ఆత్మాహుతి దాడి జ‌ర‌గడానికి కొన్ని క్ష‌ణాల ముందు సుఖ్జీందర్ సింగ్ అనే జవాన్ తన భార్యకు ఓ వీడియోని పంపాడు.ఘటన జరిగిన వారం తరువాత ఆ జవాన్ సతీమణి ఆ వీడియోను షేర్ చేశారు. పంజాబ్‌లోని తరన్‌ తారణ్‌కు చెందిన ఆయన 76వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. జైషే మహ్మద్‌‌ […]

పుల్వామా దాడి జరిగే కొద్ది క్షణాల ముందు.. ఓ జవాన్ తీసిన వీడియో..
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:17 PM

పంజాబ్ : పుల్వామా ఉగ్రదాడి జరిగే కొద్ది క్షణాల బస్సులోంచి ఓ జవాన్ తీసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాన్వాయ్‌పై కారు బాంబుతో ఆత్మాహుతి దాడి జ‌ర‌గడానికి కొన్ని క్ష‌ణాల ముందు సుఖ్జీందర్ సింగ్ అనే జవాన్ తన భార్యకు ఓ వీడియోని పంపాడు.ఘటన జరిగిన వారం తరువాత ఆ జవాన్ సతీమణి ఆ వీడియోను షేర్ చేశారు. పంజాబ్‌లోని తరన్‌ తారణ్‌కు చెందిన ఆయన 76వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. జైషే మహ్మద్‌‌ ఉగ్రవాది పేల్చివేసిన సీఆర్‌పీఎఫ్ బస్సులో సింగ్ కూడా ఉన్నారు. ఈ దాడి జరిగే కొద్ది నిమిషాల ముందు ఈ వీడియో పంపినప్పటికీ శుక్రవారమే ఆయన భార్య కంటపడింది. జాతీయ రహదారిపై సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండగా మొబైల్‌ ఫోన్‌లో ఈ వీడియో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. సుఖ్జీందర్ సింగ్ ముఖంతో పాటు.. బస్సులోని కొందరు సైనికులు, రోడ్డు పక్కన కురుస్తున్న మంచు ఇందులో కనిపిస్తున్నాయి. ఈ వీడియో తీసుకున్న కొన్ని క్షణాలకే సుఖ్జీందర్ సింగ్ సహా బస్సులోని ఆయన సహచరులంతా ఉగ్రదాడికి బలైపోయారు. కశ్మీర్‌లో తిరుగుబాటు ప్రారంభమైన మూడు దశాబ్దాల కాలంలోనే ఈ దాడి భీకరమైనదిగా భావిస్తున్నారు. కాగా సుఖ్జీందర్ సింగ్‌కు ఏడు నెలల కుమారుడు, భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. 2003లో 19 ఏళ్ల వయసులో ఆయన సైన్యంలో చేరారు. 8 నెలల క్రితమే హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన సుఖ్జీందర్… అంతలోనే అమరుడు కావడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.