కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..

COVID 19 Alert: చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచదేశాలన్నింటిని గజగజలాడిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి సుమారు 8,943 మంది మృతి చెందగా.. 2,18,663 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక భారత్‌లో కూడా ఈ కోవిడ్ 19 చాప కింద నీరులా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 166 కేసులు నమోదు కాగా.. అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే కరోనా ప్రభావం భారత పౌల్ట్రీ రైతులపై తీవ్రంగా […]

కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..
Follow us

|

Updated on: Mar 19, 2020 | 10:48 AM

COVID 19 Alert: చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచదేశాలన్నింటిని గజగజలాడిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి సుమారు 8,943 మంది మృతి చెందగా.. 2,18,663 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక భారత్‌లో కూడా ఈ కోవిడ్ 19 చాప కింద నీరులా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 166 కేసులు నమోదు కాగా.. అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఇదిలా ఉంటే కరోనా ప్రభావం భారత పౌల్ట్రీ రైతులపై తీవ్రంగా పడిందని చెప్పాలి. చికెన్ తింటే కరోనా వస్తుందంటూ పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేయడంతో చికెన్ సేల్స్ పూర్తిగా డౌన్ అయిపోయాయి. దీనితో పౌల్ట్రీ రైతులు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మొన్నటికి మొన్న కర్ణాటకకు చెందిన ఓ రైతు ఏకంగా ఐదు వేల కోళ్లను సజీవ సమాధి చేయగా.. ఇదే బాటలో కేరళ ప్రభుత్వం కూడా కోళ్లను పూడ్చిపెట్టింది.

ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా కోళ్లను పూడ్చి పెట్టడంతో.. వారి బ్రతుకుల మీద కరోనా ప్రభావం ఎంతలా పడిందో అర్ధమవుతోంది. వరంగల్ జిల్లా చెన్నరావుపేటకు చెందిన చాపర్తి రాజు అనే రైతు 25 రోజుల క్రితం సహకార సంఘం పరిధిలోని కోళ్ల షెడ్డులో కిరాయికి బ్రాయిలర్ కోళ్లును పెంచుతున్నాడు. కోవిడ్ దెబ్బకు చికెన్ రేట్ పడిపోవడంతో.. అతడు మంగళవారం ప్రజలకు ఉచితంగా కోళ్లను పంపిణీ చేశాడు. అంతేకాకుండా మరో 2 వేలుపైగా ఉన్న కోళ్లను బ్రతికుండగానే పూడ్చి పెట్టాడు.

For More News:

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఫ్లాష్ న్యూస్: కరోనా ప్రభావం.. సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..

Breaking: తెలంగాణలో ఒక్క రోజులోనే 8 కరోనా పాజిటివ్ కేసులు..

కరోనా ఎఫెక్ట్.. ఒకేసారి ఆరు నెలల రేషన్ సరుకులు…

Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు