Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..

COVID 19: తెలుగు రాష్ట్ర ప్రజలను కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 13కు చేరగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రెండో కోవిడ్ 19 పాజిటివ్ కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. లండన్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడు ప్రస్తుతం ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇక అటు మంగళగిరిలో ఓ యువతికి కరోనా లక్షణాలు ఉండటంతో గుంటూరులోని […]

Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..
Follow us

|

Updated on: Mar 19, 2020 | 8:41 AM

COVID 19: తెలుగు రాష్ట్ర ప్రజలను కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 13కు చేరగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రెండో కోవిడ్ 19 పాజిటివ్ కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. లండన్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడు ప్రస్తుతం ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.

ఇక అటు మంగళగిరిలో ఓ యువతికి కరోనా లక్షణాలు ఉండటంతో గుంటూరులోని ఐడీ ఆసుపత్రికి తరలించారు.  కాగా, ఇటీవల విదేశాల నుంచి నెల్లూరుకు వచ్చిన ఒక వ్యక్తికీ వైరస్ సోకగా.. అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అటు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించింది. కేవలం స్కూళ్లు, కళాశాలలే కాకుండా.. యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లను మూతపడ్డాయి. మరోవైపు కరోనా ఎఫెక్ట్‌తో స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.

For More News:

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఫ్లాష్ న్యూస్: కరోనా ప్రభావం.. సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..

Breaking: తెలంగాణలో ఒక్క రోజులోనే 8 కరోనా పాజిటివ్ కేసులు..

కరోనా ఎఫెక్ట్.. ఒకేసారి ఆరు నెలల రేషన్ సరుకులు…