కరోనా ఎఫెక్ట్.. ఒకేసారి ఆరు నెలల రేషన్ సరుకులు…

Coronavirus Effect: భారత్‌పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు 166 నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మాల్స్, విద్యాసంస్థలు, థియేటర్లను మూసివేయగా.. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాట పడుతున్నాయి. దీనితో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావంతో దాదాపు భారతదేశం కొద్దిరోజులు షట్‌డౌన్ కానుండగా.. […]

కరోనా ఎఫెక్ట్.. ఒకేసారి ఆరు నెలల రేషన్ సరుకులు...
Follow us

|

Updated on: Mar 19, 2020 | 8:31 AM

Coronavirus Effect: భారత్‌పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు 166 నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మాల్స్, విద్యాసంస్థలు, థియేటర్లను మూసివేయగా.. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాట పడుతున్నాయి. దీనితో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా ప్రభావంతో దాదాపు భారతదేశం కొద్దిరోజులు షట్‌డౌన్ కానుండగా.. పేదలకు ఇచ్చే రేషన్ విషయంలో మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 75 కోట్ల మంది సబ్సిడీలో ఇచ్చే ఆహార పదార్ధాలను (బియ్యం, గోధుమలు, పంచదార, వగైరా…) ఆరు నెలలవి ఒకేసారి తీసుకోవచ్చునని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రకటించారు.

ప్రస్తుతం వినియోగదారులు రేషన్ సరుకులు రెండు నెలలవి ముందుగా తీసుకుంటుండగా.. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం ఆరు నెలల రేషన్ సరుకులను పేదలకు పంచిపెడుతోంది. గోడౌన్‌లలో కావాల్సినన్ని ఆహార పదార్ధాలు ఉన్నాయని.. కరోనా ప్రభావం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పేదలకు ఆరు నెలల రేషన్ సరుకులను ఇవ్వాలని సూచించినట్లు మంత్రి తెలిపారు.

For More News:

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఫ్లాష్ న్యూస్: కరోనా ప్రభావం.. సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..

Breaking: తెలంగాణలో ఒక్క రోజులోనే 8 కరోనా పాజిటివ్ కేసులు..