కోవిడ్ లక్షణాలు ఉండి.. ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరిస్తే చర్యలే..

Coronavirus Chain Scare: తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా వేగంగా విజృంభిస్తోంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌పై అంటువ్యాధుల నివారణ చట్టాన్ని ప్రయోగించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం కోవిడ్ లక్షణాలున్న ఏ వ్యక్తి అయినా హాస్పిటల్ లో చేరేందుకు నిరాకరిస్తే.. అతనిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేయవచ్చు. వీటిని అమలు చేసే […]

కోవిడ్ లక్షణాలు ఉండి.. ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరిస్తే చర్యలే..
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 22, 2020 | 2:18 PM

Coronavirus Chain Scare: తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా వేగంగా విజృంభిస్తోంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌పై అంటువ్యాధుల నివారణ చట్టాన్ని ప్రయోగించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం కోవిడ్ లక్షణాలున్న ఏ వ్యక్తి అయినా హాస్పిటల్ లో చేరేందుకు నిరాకరిస్తే.. అతనిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేయవచ్చు.

వీటిని అమలు చేసే బాధ్యతలను కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్లు, ప్రజారోగ్య డైరెక్టర్, డీఎంఈ, వైద్య విధాన కమిషనర్లకు కల్పించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అంటువ్యాధుల చట్టం ఏడాది పాటు అమలు కానుంది. కరోనా వైరస్ ప్రభావాన్ని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చట్టం ద్వారా ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు తమ వద్దకు వచ్చే కరోనా అనుమానిత కేసులను పరీక్షించి.. వారి ప్రయాణ చరిత్రను పైన పేర్కొన్న అధికారులకు సమాచారం అందించాలి.

For More News:

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..

కరోనా భయం.. జైలుకు నిప్పంటించిన ఖైదీలు…

కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు రాష్ట్రాలూ లాక్‌డౌన్..

తెలంగాణలో జనతా కర్ఫ్యూ.. ఆ సేవలకు మాత్రమే మినహాయింపు..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..

భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మరణాలు…

కరోనా కట్టడికి ఎబోలా మెడిసిన్ రెడీ.. ట్రయల్స్ షురూ..!

వైరస్ వణుకు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు నెలల రేషన్ ఫ్రీ..