కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..

Coronavirus Effect: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు వారం పాటు సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అటు సచివాలయ ఉద్యోగులను కూడా రెండు బ్యాచులుగా విడిపోయి వంతుల వారీగా పని చేయాలని ఆదేశించింది. ఒక్క బ్యాచ్ వారం రోజులు ఇంటి దగ్గర నుంచి పని చేస్తే.. రెండో బ్యాచ్ కార్యాలయాలకు వచ్చి పని చేయాలి. అలాగే వారం […]

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..
Follow us

|

Updated on: Mar 22, 2020 | 2:21 PM

Coronavirus Effect: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు వారం పాటు సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అటు సచివాలయ ఉద్యోగులను కూడా రెండు బ్యాచులుగా విడిపోయి వంతుల వారీగా పని చేయాలని ఆదేశించింది. ఒక్క బ్యాచ్ వారం రోజులు ఇంటి దగ్గర నుంచి పని చేస్తే.. రెండో బ్యాచ్ కార్యాలయాలకు వచ్చి పని చేయాలి. అలాగే వారం తర్వాత రెండో బ్యాచ్ ఇంటి నుంచి.. మొదటి బ్యాచ్ కార్యాలయాల నుంచి పని చేస్తాయని తెలిపారు.

అటు సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను సైతం రెండు బ్యాచులుగా విభజించి.. ఒక్కో బ్యాచ్‌కు వారం పాటు సెలవులు ఇచ్చింది. అలాగే జిల్లా అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. కాగా, గెజిటెడ్ అధికారులందరూ విధులకు హాజరు కావాలని ప్రభుత్వం సూచించింది.

For More News:

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..

కోవిడ్ లక్షణాలు ఉండి.. ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరిస్తే చర్యలే..

కరోనా భయం.. జైలుకు నిప్పంటించిన ఖైదీలు…

కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు రాష్ట్రాలూ లాక్‌డౌన్..

తెలంగాణలో జనతా కర్ఫ్యూ.. ఆ సేవలకు మాత్రమే మినహాయింపు..

భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మరణాలు…

కరోనా కట్టడికి ఎబోలా మెడిసిన్ రెడీ.. ట్రయల్స్ షురూ..!

వైరస్ వణుకు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు నెలల రేషన్ ఫ్రీ..