కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు రాష్ట్రాలూ లాక్‌డౌన్..

COVID 19 Chain Scare: దేశమంతటా కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో రాజస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22 నుంచి 31 వరకు రాష్ట్రాన్ని లాక్‌డౌన్ చేస్తున్నట్లు సిఎం అశోక్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పది రోజులు అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయని ఆయన అన్నారు. రాజస్థాన్‌కు వచ్చే అన్ని జాతీయ రహదారులను క్లోజ్ చేయడమే కాకుండా ప్రైవేటు ఆఫీసులు, మాల్స్, షాప్స్, ఫ్యాక్టరీలను మూసివేస్తున్నట్లు స్పష్టం చేశారు. […]

కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు రాష్ట్రాలూ లాక్‌డౌన్..
Follow us

|

Updated on: Mar 22, 2020 | 2:19 PM

COVID 19 Chain Scare: దేశమంతటా కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో రాజస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22 నుంచి 31 వరకు రాష్ట్రాన్ని లాక్‌డౌన్ చేస్తున్నట్లు సిఎం అశోక్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పది రోజులు అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయని ఆయన అన్నారు. రాజస్థాన్‌కు వచ్చే అన్ని జాతీయ రహదారులను క్లోజ్ చేయడమే కాకుండా ప్రైవేటు ఆఫీసులు, మాల్స్, షాప్స్, ఫ్యాక్టరీలను మూసివేస్తున్నట్లు స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులూ దొరికే దుకాణాలు, మెడికల్ షాప్‌లు, పాల వ్యాపారం మాత్రమే కొనసాగుతుందని చెప్పారు. కాగా, దేశంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది.

పుదుచ్చేరి రాష్ట్రం కూడా లాక్‌డౌన్..!

రాజస్థాన్ బాటలోనే పుదుచ్చేరి రాష్ట్రం కూడా లాక్‌డౌన్ ప్రకటించింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూను ఈ నెల 31 వరకు కొనసాగిస్తామని పుదుచ్చేరి సిఎం వెల్లడించారు. కాగా, వారం రోజుల పాటు నిత్యావసర సరుకులు కొనేందుకు రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు.. అలాగే సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రాజస్థాన్‌లో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. పుదుచ్చేరిలో ఒక్క కేసు నమోదయ్యింది. అటు దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 327కు చేరుకుంది.

For More News:

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..

కోవిడ్ లక్షణాలు ఉండి.. ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరిస్తే చర్యలే..

కరోనా భయం.. జైలుకు నిప్పంటించిన ఖైదీలు…

తెలంగాణలో జనతా కర్ఫ్యూ.. ఆ సేవలకు మాత్రమే మినహాయింపు..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..

భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మరణాలు…

కరోనా కట్టడికి ఎబోలా మెడిసిన్ రెడీ.. ట్రయల్స్ షురూ..!

వైరస్ వణుకు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు నెలల రేషన్ ఫ్రీ..