AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రేమ పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ఆ ప్రేమికులు ఏం చేశారంటే..?

ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని హాయిగా జీవితం కొనసాగించాలని భావించారు. కానీ వారి ప్రేమ పెళ్లికి కులం అడ్డుపడింది. దీంతో ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Telangana: ప్రేమ పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ఆ ప్రేమికులు ఏం చేశారంటే..?
Tragic Love Story
M Revan Reddy
| Edited By: |

Updated on: Apr 28, 2024 | 12:35 PM

Share

ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని హాయిగా జీవితం కొనసాగించాలని భావించారు. కానీ వారి ప్రేమ పెళ్లికి కులం అడ్డుపడింది. దీంతో ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్ గౌడ్ వ్యవసాయ పనులతో పాటు సూర్యాపేటలో వాటర్ ఫూరిఫైయర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన చల్లగుండ్ల నాగజ్యోతి నర్సింగ్ పూర్తి చేసి సూర్యాపేటలో ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తోంది. ఓకే గ్రామం కావడంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రతి రోజూ సూర్యాపేటకు వెళ్లే సంజయ్.. అక్కడే ఉంటున్న నాగజ్యోతితో నాలుగేళ్లుగా ప్రేమాయణం కొనసాగించాడు. ఇద్దరి కులాలు వేరైనప్పటికీ ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రేమ పెళ్లికి అడ్డు వచ్చిన కులం..

ప్రేమ పెళ్లి విషయాన్ని కుటుంబాల పెద్దలకు చెప్పారు. ఈ ప్రేమ పెళ్లికి కులం అడ్డుపడింది. సంజయ్ గౌడ సామాజిక వర్గానికి చెందగా, నాగజ్యోతి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతి. కులాలు వేరువేరు కావడంతో వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారు. ప్రేమ జంట.. పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ వివాహానికి అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో అర్ధరాత్రి గ్రామ శివారులో ప్రేమజంట పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. తెల్లవారు జామున మిగతా జీవులైన సంజయ్, నాగజ్యోతిలను గుర్తించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. ప్రేమికుల ఆత్మహత్య ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…