Missing Mystery: పరిచయం లేని వ్యక్తి ఎల్లయ్యను వెతుక్కుంటూ ఎలా వచ్చింది..? ఇంతకీ ఎల్లయ్య జాడ ఎక్కడ?

మాజీ నక్సలైట్, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఎల్లయ్య అదృశ్యం.. దృశ్యం సినిమాను తలపిస్తోంది. ఎల్లయ్య విరోధులే పథకం ప్రకారం కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు చేధించే పనిలో పడ్డారు.

Missing Mystery:  పరిచయం లేని వ్యక్తి ఎల్లయ్యను వెతుక్కుంటూ ఎలా వచ్చింది..? ఇంతకీ ఎల్లయ్య జాడ ఎక్కడ?
Vadde Yellaiah
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 28, 2024 | 2:21 PM

మాజీ నక్సలైట్, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఎల్లయ్య అదృశ్యం.. దృశ్యం సినిమాను తలపిస్తోంది. ఎల్లయ్య విరోధులే పథకం ప్రకారం కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తుస్తున్నారు.

సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన వడ్డే ఎల్లయ్య సిపిఐ ఎంఎల్ జనశక్తి గ్రూపులో నక్సలైట్ గా పనిచేశాడు. జనజీవన స్రవంతిలో కలిసిన ఎల్లయ్య, ప్రస్తుతం సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేసే ఎల్లయ్య పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. అక్రమంలోనే ఎల్లయ్యను ఆశ్రయించింది ఓ కుటుంబం. హైదరాబాద్‌కు చెందిన అపర్ణ, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శ్రీనివాస్ లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ కు 20 లక్షల రూపాయలు అపర్ణ ఇచ్చింది. అప్పటివరకు అపర్ణతో కలిసి ఉన్న ప్రియుడు శ్రీనివాస్ ఆ తర్వాత ముఖం చాటేయడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారి కేసు ఎల్లయ్య వద్దకు చేరింది.

పథకం ప్రకారమే కిడ్నాప్…

చిన్నపాటి భూవివాదాలు సెటిల్‌మెంట్లు చేసే ఎల్లయ్య వద్దకు అపర్ణ, శ్రీనివాసల పంచాయతీ వచ్చింది. ఈ పంచాయతీ చేసేందుకు ఎల్లయ్యతో అపర్ణ ఐదు లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకుని లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. ఈ పంచాయతీ కోసం పెద్దమనిషిగా ఏఫ్రిల్ 18వ తేదీన కారు తీసుకుని అపర్ణతో కలిసి ఎల్లయ్య జగ్గయ్య పేటకు వెళ్లాడు. అప్పటి నుండి ఎల్లయ్య ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఎల్లయ్య భార్య ఎల్లమ్మ, కుటుంబ సభ్యులు సూర్యాపేట, జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. జగ్గయ్యపేట పోలీసులు ఎల్లయ్యపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఆనాటి నుండి రెండు రాష్ట్రాల పోలీసులు ఎల్లయ్య కోసం వెతుకుతున్న ఆచూకీ లభించలేదు.

ఎల్లయ్య మిస్సింగ్ వెనుక పెద్ద స్కెచే..!

ఎల్లయ్య మిస్సింగ్ వెనుక ఏదో పెద్ద స్కెచే ఉందని ఎల్లయ్య కుటుంబ సభ్యులు, సూర్యాపేట పోలీసులు అనుమానిస్తున్నారు. పరిచయం లేని, హైదరాబాద్‌లో ఉండే ఓ అపర్ణ ఎల్లయ్యను వెతుక్కుంటూ ఎలా వచ్చింది..? ఫేక్ పంచాయతీ సృష్టించి జగ్గయ్యపేట వరకు ఎల్లయ్యను తీసుకెళ్లడం వెనుక పెద్ద ప్లానే ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ప్రత్యర్థులే ఎల్లయ్యను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. ఎల్లయ్య మిస్సింగ్ వెనుక సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడిపై ఎల్లయ్య కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడితో ఎల్లయ్యకు పాత గొడవలు, ల్యాండ్ సెటిల్‌మెంట్ విషయంలో వివాదాలు ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఎల్లయ్యను హత్య చేసి ఉంటారని….

ఈ నేపథ్యంలోనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఎల్లయ్య తీసుకెళ్లిన కారు మాత్రం ఈ నెల 25న జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు సమీపంలో లభించింది. కానీ ఎల్లయ్య ఆచూకీ లభించలేదు. జగ్గయ్యపేటకు వచ్చిన ఎల్లయ్యను లాడ్జికి తీసుకెళ్లి అక్కడే హత్య చేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. ఈ ఘటనలో మహిళ ప్రియుడే ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఎల్లయ్య కోసం నాలుగు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఎల్లయ్య డెడ్ బాడీ దొరికితేనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

Latest Articles
బచ్చలికూరతో మెరిసే అందం.. ఒక్కసారి ట్రై చెయ్యండి.
బచ్చలికూరతో మెరిసే అందం.. ఒక్కసారి ట్రై చెయ్యండి.
ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు..టీడీపీ-వైసీపీ శ్రేణుల బాహాబాహి
ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు..టీడీపీ-వైసీపీ శ్రేణుల బాహాబాహి
పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?
పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..