Human Hair Industry: జుట్టు రాలిపోతుందా? చింతించకండి.. మీ జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే
రోజూ జుట్టు రాలిపోతుందా? తలలో దువ్వెన పెట్టగానే వెంట్రుకలు రాలిపోలిపోయి చేతికి ఊడి వస్తున్నాయా? మరేం పర్వాలేదు.. అలా ఊడిన జుట్టుతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవును.. డస్ట్‌బిన్‌లో వృధాగా పడేసే వెంట్రుకల ఖరీదు తెలిస్తే అస్సలు చింతించరు. .
Updated on: Apr 28, 2024 | 1:01 PM

రోజూ జుట్టు రాలిపోతుందా? తలలో దువ్వెన పెట్టగానే వెంట్రుకలు రాలిపోలిపోయి చేతికి ఊడి వస్తున్నాయా? మరేం పర్వాలేదు.. అలా ఊడిన జుట్టుతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవును.. డస్ట్‌బిన్‌లో వృధాగా పడేసే వెంట్రుకల ఖరీదు తెలిస్తే అస్సలు చింతించరు.

తల నుంచి రాలిన వెంట్రుకలకు మహా అయితే రూ.100, రూ.200 ఉంటుందని అనుకుంటే పొరబాటే. ముఖ్యంగా భారతీయలు వెంట్రుకలు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. కేజీ వెంట్రుకలు రూ.40 వేలకు విక్రయిస్తున్నారు

అందుకే మన దేశంలో వీధుల్లో జుట్టు కొనుగోలు చేసే హాకర్లు అధికంగా ఉన్నారు. వెంట్రుకలకు బదులుగా వంట పాత్రలు, ఇతర వస్తువులు ఇస్తుంటారు.మీ జుట్టు కూడా తప్పకుండా రాలిపోతుంటే బయట వృద్ధాగా పారవేయకండి. విక్రేతలకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. ఈ వెంట్రుకల ద్వారా విదేశాల్లో వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. భారత్‌లోనూ ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.

పొడవాటి జుట్టుకు విదేశీయులలో డిమాండ్ ఉంది. భారతీయ పొడవాటి జుట్టును చాలా మంది ప్రజలు ఇష్టపడతారు, దీని కోసం భారతీయ జుట్టును మంచి ధరకు విక్రయించవచ్చు.

వెంట్రుకలు భారతదేశం నుండి చైనా, మలేషియా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్‌లకు ఎగుమతి అవుతున్నాయి. జుట్టు ధర దాని పరిమాణం, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అంటే జుట్టు పొడవుగా ఉంటే ధర ఎక్కువ. జుట్టు నాణ్యత బాగా ఉంటే, ధర మరింత పలుకుతుంది. నల్లటి జుట్టు కిలో 10 నుంచి 40 వేల వరకు విదేశాల్లో అమ్ముడవుతోంది.




