- Telugu News Photo Gallery Cinema photos Aamir khan sitare zameen par Ayushmann Khurrana spy action suspense thriller movie going on sets soon
త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న బాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు
అభిమాన నటుడిని కొట్టడం అత్యంత ఇబ్బందికరమైన సిట్చువేషన్ అని అన్నారు నటి మృణాల్ ఠాకూర్. షాహిద్ అంటే మృణాల్‌కి విపరీతమైన అభిమానమట. వారిద్దరూ కలిసి హిందీ జెర్సీలో నటించారు. అందులో ఓ సన్నివేశంలో అతన్ని కొట్టాల్సి వచ్చిందట. అయితే తాను కొట్టలేకపోయానని, ఆ షాట్‌ని చిత్రీకరించడానికి మూడు గంటలు పట్టిందని అన్నారు మృణాల్. అమీర్‌ఖాన్ నటించిన ‘తారే జమీన్ పర్’ ని సినీ ప్రియులు అంత తేలిగ్గా మర్చిపోలేరు.
Updated on: Apr 28, 2024 | 12:50 PM

Mrunal Thakur: అభిమాన నటుడిని కొట్టడం అత్యంత ఇబ్బందికరమైన సిట్చువేషన్ అని అన్నారు నటి మృణాల్ ఠాకూర్. షాహిద్ అంటే మృణాల్‌కి విపరీతమైన అభిమానమట. వారిద్దరూ కలిసి హిందీ జెర్సీలో నటించారు. అందులో ఓ సన్నివేశంలో అతన్ని కొట్టాల్సి వచ్చిందట. అయితే తాను కొట్టలేకపోయానని, ఆ షాట్‌ని చిత్రీకరించడానికి మూడు గంటలు పట్టిందని అన్నారు మృణాల్.

Aamir Khan: అమీర్‌ఖాన్ నటించిన ‘తారే జమీన్ పర్’ ని సినీ ప్రియులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇలాంటి కథతోనే ‘సితారే జమీన్ పర్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. వచ్చే నెలలో ఢిల్లీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. అమీర్‌ఖాన్‌తో పాటు పదకొండు మంది పిల్లలు ఈ సినిమాలో కనిపిస్తారు. పారా ఒలింపిక్స్ నేపథ్యంలో కథ సాగుతుంది.

Ayushmann Khurrana: ఆయుష్మాన్ ఖురానా హీరోగా కరణ్‌జోహార్ నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. స్పై కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. హీరోయిన్‌గా సారా అలీఖాన్ పేరు వినిపిస్తోంది.

Vamshi Paidipally: షాహిద్ కపూర్ హీరోగా వంశీ పైడిపల్లి ప్యాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అందులో నిజం లేదని అన్నారు వంశీ పైడిపల్లి. తన నెక్స్ట్ సినిమా గురించి ప్రకటించడానికి ఇంకా సమయం ఉందని అన్నారు. ప్రస్తుతం ఏదీ రివీల్ చేయలేనని చెప్పారు. సరైన సమయంలో అఫిషియల్‌గా అనౌన్స్ చేస్తామన్నారు.

Satyabhama: కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా సత్యభామ. మే 17న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి కళ్లారా అనే పాటను విడుదల చేశారు మేకర్స్. శ్రేయ ఘోషల్ ఈ పాటను ఆలపించారు. కాజల్, నవీన్‌చంద్ర మీద తెరకెక్కించారు ఈ పాటని.




