- Telugu News Photo Gallery Cinema photos Vijay devara konda VD13 will not have songs goat life is the third movie in highest collection in kerala
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మ్యూజిక్ పరంగా ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కార్తి ఖైదీ తరహాలో విజయ్, గౌతమ్ సినిమాలో పాటలేం ఉండవని.. కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనే సినిమా నడుస్తుందని ప్రచారం జరుగుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ తెరకెక్కించిన సినిమా గోట్ లైఫ్. ఆడు జీవితం పేరుతో ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేసారు.
Updated on: Apr 28, 2024 | 1:36 PM

VD13: విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మ్యూజిక్ పరంగా ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కార్తి ఖైదీ తరహాలో విజయ్, గౌతమ్ సినిమాలో పాటలేం ఉండవని.. కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనే సినిమా నడుస్తుందని ప్రచారం జరుగుతుంది.

Goat Life: పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ తెరకెక్కించిన సినిమా గోట్ లైఫ్. ఆడు జీవితం పేరుతో ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేసారు. మలయాళంలో ఈ సినిమా మరో రికార్డ్ సాధించింది. కేరళలో 75 కోట్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. పులి మురుగన్, 2018 సినిమాల తర్వాత కేరళలో 75 కోట్లు వసూలు చేసిన మూడో సినిమాగా చరిత్ర సృష్టించింది ఆడు జీవితం.

Gam Gam Ganesha: బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న సినిమా గం గం గణేశా. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర రిలీజ్ డేట్ ఖరారైంది. మే 31న విడుదల కానుంది గం గం గణేశా. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గం గం గణేశా రానుంది. ఇందులో ఆనంద్ దేవరకొండకు జోడీగా ప్రగతి శ్రీవాస్తవ నటిస్తున్నారు.

Premikudu: ప్రభుదేవా, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్ ప్రేమికుడు. మే 1న ప్రపంచ వ్యాప్తంగా 300 థియేటర్లలో ప్రేమికుడు సినిమాను మరోసారి విడుదల చేయబోతున్నారు. 30 ఏళ్ళ కింద విడుదలైన ప్రేమికుడు తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. రీ రిలీజ్‌లోనూ ఇదే మ్యాజిక్ జరుగుతుందని నమ్ముతున్నారు మేకర్స్.

Vakeel Saab: పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో వచ్చిన వకీల్ సాబ్ సినిమాను మే 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన కూడా పోటీలో ఉంది. ఈ సందర్భంగానే ఎలక్షన్ టైమ్ క్యాష్ చేసుకోడానికి వకీల్ సాబ్ సినిమాను మరోసారి విడుదల చేయబోతున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.




