భార్యాభర్తలకు అలర్ట్.. ప్రైవేట్ లైఫ్ గురించి ఇతరులతో పంచుకుంటున్నారా..? 

28 April 2024

Shaik Madar Saheb

ఏ రిలేషన్‌షిప్ అయినా.. ప్రేమ, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. చిన్న చిన్న గొడవలొచ్చినా ఈ రెండూ బంధాన్ని కొనసాగించేలా చేస్తాయి..

ప్రస్తుత కాలంలో రిలేషన్ షిప్ అప్‌డేట్‌లను షేర్ చేసుకోవడం వల్ల కొన్ని జంటలు ప్రమాదంలో పడుతున్నాయి..

భార్యా భర్త తమ సంబంధాన్ని ప్రైవేట్‌గా ఉంచుకున్నంత కాలం, వారి మధ్య భావాలు, మాటలు ఇతరుల నుంచి సేఫ్‌గా ఉంటాయి..

ఎప్పుడైతే ప్రైవేట్ లైఫ్ గురించి భార్యా లేదా భర్త వేరే వ్యక్తులతో షేర్ చేసుకుంటారో.. అప్పుడు బంధం ప్రమాదంలో పడుతుంది

ఆధునిక కాలంలో ప్రైవేట్ విషయాలు చెప్పుకునే ధోరణి చాలా వేగంగా పెరుగుతోంది. తమ జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఇష్టపడతారు. 

చిత్రాలు, వీడియోల ద్వారా ఇతరుల నుంచి ప్రశంసలు పొందాలని, తమను తాము బాగా చూపించాలని కోరుకుంటారు.

ఇది మంచి పద్దతి కాదని.. సంబంధాలను గోప్యంగా ఉంచడం చాలా ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు.. ఇది సాన్నిహిత్యాన్ని ప్రోత్సహిస్తుంది. 

మీరు మీ భాగస్వామితో విషయాలను ప్రైవేట్‌గా ఉంచినప్పుడు అది సంబంధం లోతును పెంచుతుంది.. అపార్థాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఆరోగ్యకర సంబంధం కోసం.. వ్యక్తిగత విషయాలు జంటల మధ్య మాత్రమే పరిమితమైతే.. సంబంధం బలంగా.. దీర్ఘకాలం కొనసాగుతుంది.