'నా పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా..' అన్ని జ్ఞాపకాలు మటాష్!
April 28, 2024
TV9 Telugu
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ సామ్ - చై జంటకు ఎవరి దిష్టి తగిలిందో అర్ధాంతరంగా వీరి వైవాహిక బంధం ముక్కలైంది. అభిమానులు ఇప్పటికీ వీరి విడాకుల వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు
అటు సమంత వరుస ఆఫర్లతో కెరీర్‌లో దూసుకుపోతుంటే.. ఇటు నాగ చైతన్య కూడా తన దైన రీతిలో కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడు. వీరిరువురూ తమ పెళ్లినాటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో తుడిచేసిన సంగతి తెలిసిందే
ఇక సామ్ అయితే తన శరీరంపై వేయించుకున్న టాటూలతోపాటు తన పెళ్లినాటి బట్టలతో సహా అన్ని జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేసింది. తాజాగా తన వెడ్డింగ్ గౌన్‌ను కూడా నామరూపం లేకుండా మార్చేసింది
సాధారణంగా ఎవరైనా తమ జీవితంలో జరిగిన శుభకార్యాలను, వాటి తాలూకు వస్తువులు, దుస్తులను చిరకాలం జ్ఞాపకంగా భద్రపరచుకుంటారు. కానీ సామ్ ప్రవర్తన ఈ విషయంలో కొంత వింతగానే ఉంది
దీనిని బట్టి చూస్తే తాను కోరి వరించిన వైవాహిక బంధం వల్ల తాను ఎంతగా అప్‌సెట్ అయ్యిందో తెలుస్తుంది. తన పెళ్లినాటి జ్ఞాపకాలను తన జీవితం నుంచి పూర్తిగా తొలగించేస్తుంది
తాజాగా తన పెళ్లి గౌన్‌ని రీసైక్లింగ్ చేసి రీమోడలింగ్ చేయించుకొని కొత్త హంగులద్దింది. ఇటీవలే ఓ అవార్డుల ఫంక్షన్‌లో భాగంగా ఈ సస్టెయినబుల్ గౌన్‌ని ధరించి మెరిసిపోయిందీ ముద్దుగుమ్మ
ఈ గౌన్ విశేషాల్ని తాజాగా తన ఇన్‌స్టాలో పంచుకుంది. దీంతో ఈ గౌన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘నాకున్న మంచి అలవాట్లలో సస్టెయినబిలిటీ ఒకటి..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది
‘ఎల్లే సస్టెయినబిలిటీ అవార్డు’ల్లో భాగంగా దీన్ని ధరించిన ముద్దుగుమ్మ.. ‘స్పెషల్ లీడర్స్ ఆఫ్ ఛేంజ్ (ఫీమేల్)’ అవార్డు గెలుచుకుంది. ప్రముఖ డిజైనర్ క్రేశా బజాజ్ ఈ నలుపు రంగు గౌన్‌ను రూపొందించారు