Mrunal Thakur: అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..

బాలీవుడ్ లో కబీర్ సింగ్, సూపర్ 30లాంటి సినిమాల్లో నటించిన మృణాల్, తెలుగులో సీతా రామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తొలి సినిమాతో తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్.

Mrunal Thakur: అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
Mrunal Thakur
Follow us

|

Updated on: Apr 28, 2024 | 12:51 PM

ఇప్పుడు టాలీవుడ్ లో మృణాల్ రాకుర్ పేరు మరు మ్రోగుతుంది. ఈ చిన్నది చేసింది మన మూడు సినిమాలే అయినా ఓ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో కబీర్ సింగ్, సూపర్ 30లాంటి సినిమాల్లో నటించిన మృణాల్, తెలుగులో సీతా రామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తొలి సినిమాతో తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్. ఆతర్వాత హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాయ్ నాన్న సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. హాయ్ నాన్న సినిమాలో నానితో పోటీ పడుతూ నటించి మెప్పించింది మృణాల్. తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. రొమాంటిక్ సీన్స్ లో నటించడం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది మృణాల్. మృణాల్ ఠాకూర్ కిస్సింగ్ సీన్స్, బెడ్ రూమ్ సీన్లలో నటించడానికి వెనకడుతుంది. అలాంటి సీన్స్ లో నటించడానికి నేను నో చెప్తా అని అంటుంది. ఇంటెన్స్, కిస్సింగ్ సీన్స్ లో నటించడం నాకు ఇష్టం లేదు. పైగా నా తల్లిదండ్రులు అనుమతించారు అని తెలిపింది మృణాల్.

అయితే ముద్దుల సీన్ కారణంగా మృణాల్ ఠాకూర్ చాలా ఆఫర్లను మిస్ చేసుకుంది. ఇప్పటివరకు తాను నటించిన సినిమాల్లో ఏ దర్శకుడు తనను ముద్దు సీన్స్ లో నటించాలసిందే అని చెప్పలేదు అని తెలిపింది. మృణాల్ ఠాకూర్ తొలిసారిగా మరాఠీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో నటించే అవకాశం అవకాశం అందుకుంది. ‘సూపర్ 30’ సినిమాలో హృతిక్ రోషన్‌తో జతకట్టిన తర్వాత ఆమె పాపులారిటీ పెరిగింది. ‘సీతారామం’ సినిమాలో సీతా మహాలక్ష్మి అలియాస్ ప్రిన్సెస్ నూర్ జహాన్ పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.