11 May 2024

చిరంజీవికి నచ్చిన పవన్ కల్యాణ్ , రామ్ చరణ్ సినిమాలు అవే

చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. సినీ కళామతల్లికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పద్మ విభూషణ్ అందుకున్నారు మెగాస్టార్.

ఈ స్పెషల్ ఈవెంట్ ని పురస్కరించుకొని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి

ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్, పొలిటికల్ జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు మెగాస్టార్.

ఈ సందర్భంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్, అలానే తన కుమారుడు రామ్ చరణ్ నటించిన సినిమాలలో తన ఫేవరెట్ మూవీస్ ఏంటో చెప్పేశారు.

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తనకు అన్నీ ఇష్టమైనవే అన్న చిరంజీవి.. తొలిప్రేమ, బద్రి, జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఫేవరెట్ అన్నారు.

ఇక కుమరుడు రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ..చెర్రీ నటించిన సినిమాలలో మగధీర అంటే చాలా ఇష్టమన్నారు మెగాస్టార్ చిరంజీవి.