11 May 2024

బుట్టబొమ్మకు ఇది పెద్ధ ఛాలెంజ్.. పూజా సక్సెస్ అవుతుందా.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది పూజా హెగ్డే. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తానేంటో నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. 

కానీ చాలాకాలంగా తెలుగు సినిమాల్లో ఈ అమ్మడు కనిపించడం లేదు. చివరిసారిగా హిందీలో కిసీ కా బాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో కనిపించింది. 

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ పూజా హెగ్డే, వెంకటేశ్, భూమిక కీలకపాత్రలు పోషించారు. గతేడాది ఈ మూవీ రిలీజ్ ఆకట్టుకుంది. 

ప్రస్తుతం పూజా హిందీలో సంకీ సినిమాలో నటిస్తుంది. ఇందులో పూజా, అహాన్ శెట్టి జంటగా నటిస్తుండగా.. అద్నాన్, యాసిర్ తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాతో పూజా హెగ్డే కొత్త ప్రయాణం ఆరంభం కానుందని తెలుస్తోంది. జూన్ నెలలో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. 

 ఇందులో భాగంగా ఈ సినిమాకు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకు భారీ బడ్జెట్ తో సెట్ సిద్ధం చేసినట్లు టాక్. 

అలాగే అహాన్, పూజా మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రదాన ఆకర్షణగా ఉండున్నట్లు తెలుస్తోంది. అలాగే పూజా యాక్షన్ సీన్స్ చేయనున్నట్లు సమాచారం. 

ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.