11 May 2024

దటీజ్ సాయి పల్లవి.. 2 కోట్లు ఇచ్చినా ఆ పని చేయనన్న న్యాచురల్ బ్యూటీ

Pic credit - Instagram

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవిది ప్రత్యేక స్థానం. సగటు సినిమా హీరోయిన్లలా ఆమె ఎలాంటి రోల్స్ పడితే అలాంటివి చేయదు.

స్కిన్ షోకు, గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉండే సాయి పల్లవి.. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే ఎలాంటి స్టార్ హీరో సినిమానైనా వెంటనే రిజెక్ట్ చేస్తుంది.

నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించాలనుకోవడం, కమర్షియల్ హంగులకు దూరంగా ఉండడం వంటి విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటుందీ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం టాలీవుడ్ లో నాగచైతన్యతో కలిసి తండేల్ అనే సినిమాలో నటిస్తోంది సాయి పల్లవి. అలాగే బాలీవుడ్ లో రామాయణంలోనూ సీతగా కనిపించనుంది.

ఇదిలా ఉంటే ఇటీవల సాయి పల్లవికి ఒక వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చిందట. అందులో నటించడానికి ఏకంగా రూ. 2 కోట్లు ఇస్తానని ఆఫర్ చేశారట.

స్వయంగా ఆ సంస్థ అధినేతే సాయి పల్లవికి ఈ ఆఫర్ ఇచ్చాడట. అయితే సాయిపల్లవి ఒక్క క్షణం ఆలోచించకుండా ఈ భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట.

ఈ ప్రకటన బ్యూటీ ప్రొడక్ట్స్ కి సంబంధించినది కావడంతో రూ. 2కోట్ల పారితోషకం ఇస్తానన్నా తిరస్కరించిందట సాయి పల్లవి.

గతంలో కూడా సాయి పల్లవికి ఇలాంటి క్రేజీ ఆఫర్లే వచ్చాయి. అప్పుడు కూడా ఆమె సున్నితంగా వద్దని చెప్పింది. దీంతో దటీజ్ సాయి పల్లవి అంటున్నారు ఫ్యాన్స్.