TOP9 ET: ‘పద్మ విభూషణుడు’ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న చిరు.| గేమ్ ఛేంజర్ గురించి బ్యాడ్ న్యూస్.!
గేమ్ ఛేంజర్ ! ఈ సినిమా చరణ్ ఫ్యాన్స్ ఓపికకు పరీక్ష పెడుతోంది. కన్ఫూజన్ క్రియేట్ చేస్తోంది. అసలు రిలీజ్ అవుతుందా? లేదా? ఒక వేళ అయితే ఎప్పుడు అవుతుంది..అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. చరణ్ మొదలెట్టిన ఈ సినిమా.. సిరీస్ షూటింగ్‌లా సాగుతూనే.. ఆగుతూనే ఉంది. భారతీయుడు2 కారణమో లేక డేట్స్ కారణమో.. మొత్తానికి డైరెక్టర్ శంకర్ తీరే కారణమో తెలీదు కానీ.. ఇప్పుడు డీ సినిమా అక్టోబర్లో వచ్చే ఛాన్స్ లేదనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
01.chiranjeevi: ‘పద్మ విభూషణుడు’ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న చిరు.
మెగాస్టార్ చిరంజీవి.. కాదు కాదు.. పద్మ విభూషణ్ చిరంజీవి. ఇప్పుడీ పేరు అక్రాస్ సోషల్ మీడియాలో మరో సారి ట్రెండ్ అవుతోంది. మరో సారి ప్రతీ తెలుగోడిని గర్వ పడేలా చేస్తోంది. ఎస్ ! దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో రెండోది అయిన పద్మవిభూషణ్ అవార్డ్.. చిరుకు జనవరిలోనే వచ్చిందన్నది తెలిసిందే. ఇక ఆ అవార్డ్ ప్రధానోత్సవం తాజాగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ఆ అవార్డ్ వేడుకకు కొడుకు చరణ్ ,కోడలు ఉపాసన సమేతంగా వెళ్లిన చిరు.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డ్ అందుకున్నారు. ఆ వీడియోతో మరో సారి అక్రాస్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నారు.
02.Game changer: ఆశలు అడియాశలేనా.? గేమ్ ఛేంజర్ గురించి బ్యాడ్ న్యూస్.!
గేమ్ ఛేంజర్ ! ఈ సినిమా చరణ్ ఫ్యాన్స్ ఓపికకు పరీక్ష పెడుతోంది. కన్ఫూజన్ క్రియేట్ చేస్తోంది. అసలు రిలీజ్ అవుతుందా? లేదా? ఒక వేళ అయితే ఎప్పుడు అవుతుంది..అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ … చరణ్ మొదలెట్టిన ఈ సినిమా.. సిరీస్ షూటింగ్‌లా సాగుతూనే.. ఆగుతూనే ఉంది. భారతీయుడు2 కారణమో లేక డేట్స్ కారణమో .. మొత్తానికి డైరెక్టర్ శంకర్ తీరే కారణమో తెలీదు కానీ.. ఇప్పుడు డీ సినిమా అక్టోబర్లో వచ్చే ఛాన్స్ లేదనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇది కాస్త నెట్టింట కెక్కి.. అక్టోబర్‌లో ఈ సినిమా చూడాలనుకున్న ఫ్యాన్స్ ఆశలు అడియాశలే అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది.
03.prabhas: కన్నప్ప సెట్లో.. పరమేశ్వరుడిగా ప్రభాస్ అడుగు పడింది.
ప్రభాస్ యాక్షన్ చూశాం.. ! కానీ కన్నప్పకు ప్రసన్నమై కనిపించిన.. పరమేశ్వరుడి రూపంలో మాత్రం ప్రభాస్‌ను చూడకుండా ఇప్పటి వరకు ఉన్నాం..! కానీ ఇదే సీన్‌ను అతి తొందర్లో చూడబోతున్నాం! ఎస్ ! మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా డెవోషనల్ మూవీ కన్నప్ప లో … ప్రభాస్ దేవాది దేవుడు శివునిగా కనిపిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన షూటింగ్ తాజాగా స్టార్ ట్ అయింది. సెట్లో ప్రభాస్ అడుగు పడిపోయింది. ఇక ఇదే విషయాన్ని చెబుతూ… మంచు విష్ణు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఇక ఆ పోస్టర్‌లో పరమేశ్వరుడి గెటప్‌లో ఉన్న ప్రభాస్ అడుగు కనిపిస్తోంది. అందర్నీ ఎగ్జైట్ అయ్యేలా చేస్తోంది.
04.actress Jyothi rai: నటి అళ్లీల వీడియో లీక్.. పోలీస్ యాక్షన్.!
పరిచయాలకు.. పాపులారిటీని పెంచుకునేందుకు ఉపయోగపడుతుందనకున్న సోషల్ మీడియా ఇప్పుడు అళ్లీల వీడియోలకు అడ్డా అవుతోంది. సెలబ్రిటీల మార్ఫింగ్ ఫోటోలు వైరల్ చేసే వేదికగా మారుతోంది. ఇక గత కొద్ది రోజులుగా గుప్పెడంత మనసు ఫేం జ్యోతి రాయ్ అశ్లీల వీడియోలను కూడా కొంత మంది సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ నటి తన ఆవేదన వ్యక్తం చేసింది. నా పరువు .. నా కుంటుంబ పరువు తీస్తున్నారంటూ.. ఎమోషనల్ అయింది. అంతేకాదు తన వీడియోలను మర్ఫింగ్ చేసి.. ఎడిట్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ యాక్షన్ తీసుకోవాలని వారిని కోరింది.
05.rashmika: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
ఆఫ్టర్ పుష్ప పాన్ ఇండియా రేంజ్లో సూపర్ డూపర్ హిట్! ఎప్పుడూ గుడ్ న్యూస్ చెబుతూనే ఉన్నారు రష్మిక. క్రేజీ క్రేజీ హీరోలతో.. క్రేజీప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. హిట్స్ కొడుతున్నారు. ఇక రీసెంట్‌గా యానిమల్ సినిమాతో.. త్రూ అవుట్ ఇండియా షేక్ అయ్యే రేంజ్ హిట్ కొట్టిన రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సినిమాలోనూ ఛాన్స్ పట్టేశారు. సల్మాన్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సికిందర్ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారు. ఇక ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ లో చెప్పేశారు రష్మిక.
06.aditya: అలా బ్రేకప్ అయిందో లేదో.. ఇంకో బ్యూటీని పట్టేసిన హీరో.!
ప్యార్.. డ్యాష్ డ్యాష్.. ఓర్ ధోకా.. ! అనే జమానా పోయిందిప్పుడు.. డేట్,ఫ్యార్ , బ్రేకప్ అనే జమానా వచ్చిందిప్పుడు. అయితే ఈ జామానాలో ట్రెండ్ అవుతున్న ఈ ఫార్మాట్‌ను చాలా పద్దతిగా ఫాలో అవుతున్నారు బాలీవుడ్ సెలబ్రిటీస్. ఇక అందుకే అన్నట్టు.. రెండు సంవత్సరాల నుంచి తనతో ప్రేమలో డేటింగ్లో ఉన్న హీరోయిన్ అనన్యకు, ఒక్కసారిగా బ్రేకప్ చెప్పాడు ఆషికీ హీరో ఆదిత్య రాయ్ కపూర్! బ్రేకప్ చెప్పడమే కాదు.. ఆ వెంటనే నయా లవ్ జర్నీని షురూ చేశాడు. సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ డాటర్ .. హీరోయిన్ సారా అలీఖాన్‌తో డేటింగ్ మొదలెట్టేశాడు. ఇక ఇదే ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కోడై కూస్తున్న న్యూస్!
07.sreleela: కోలీవుడ్ స్టార్ హీరోకు శ్రీలీల ఝలక్
ఎట్ ప్రజెంట్ అయితే టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. కోలీవుడ్‌లో అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి. కానీ ఈ క్రమంలోనే తనకొచ్చిన ఓ బంపర్ ఛాన్స్‌ను కాస్త సీరియస్‌గా వద్దనుకున్నారట శ్రీలీల. విజయ్ దళపతి, వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న సినిమాలో.. ఓ స్పెషల్ సాంగ్ చేయమంటూ ఈ బ్యూటీకి పిలుపు వచ్చినా.. నో చెప్పారట. విజయ్ దళపతి సినిమాలో చిన్న క్యారెక్టర్ వచ్చినా.. చేయడానికి రెడీగా బోలెడంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్న ఈ పరిస్థితుల్లో.. ఈ బ్యూటీ ఇలా నో చెప్పడం ఏంటనే కామెంట్ వస్తోంది కోలీవుడ్‌లో.!
08. Ranveer: విడాకులపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
ఓ పక్క దీపిక పదుకొనే గర్భవతి..! ఇంకో పక్క తన భర్త రణ్‌వీర్ చేశాడు.. ఇన్‌స్టాలో వీరిద్దరి పెళ్లి ఫోటోలు డిలీట్, కష్టపడి! అంతే అప్పటి నుంచి బాలీవుడ్‌లో వీరి విడాకుల న్యూస్ వైరల్ అవుతోంది. దాంతో పాటే తన భార్య దీపిక్ తల్లికాబోతున్న ఈ పరిస్థితుల్లో విడాకులు ఇవ్వడం ఏంటనే కాంట్రో కామెంట్ కూడా రణ్‌వీర్ పై విమర్శలా వచ్చింది. దీంతో ఈ న్యూస్‌పై తాజాగా క్లారిటీ ఇచ్చాడు రణ్ వీర్ సింగ్. తాము కలిసే ఉన్నామంటూ చెప్పాడు. అంతే కాదు.. 2022-23 మధ్య తాను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు డిలీట్ అయ్యాయని.. ఆయన వెళ్లడించారు. ఆ ఫోటోల్లోనే తన పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే.. మరి కొద్ది రోజుల వెయిట్ చేయాల్సిందే!
09.heeramandi: 43 దేశాల్లో ట్రెండ్ అవుతున్న హీరామండి
హీరామండి! సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో.. తెరకెక్కిన ఈ సిరీస్ ఇప్పుడు అందర్నీ విపరీంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్.. వరల్డ్ వైడ్ అత్యధిక మంది వీక్షించిన ఇండియన్ వెబ్ సిరీస్‌గా రికార్డ్ కెక్కింది. 43 దేశాల్లో టాప్ 10 లో ట్రెండింగ్‌లో ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.