లింబాద్రి గుట్ట రహస్యం..

TV9 Telugu

27 April 2024

ప్రముఖ హిందూ ఇతిహమైన బ్రహ్మ వైవర్త పురాణం లింబాద్రి గుట్టను ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా కీర్తిస్తుంది.

గోదావరి నది దక్షిణ తీరానికి రెండు యోజనాల దూరంలో భక్త ప్రహ్లాదుడు, సృష్టి కర్త బ్రహ్మ దేవుడు తపస్సు చేశారు.

శివపార్వతుల వివాహ సమయంలో బ్రహ్మ వివాహ కర్మలు చేస్తున్నప్పుడు తల్లి పార్వతి పాదాలను పొరపాటుగా చూశాడు.

ఈ చూపు వల్ల బ్రహ్మదేవుడు తన బ్రహ్మచర్యాన్ని కోల్పోయాడు, ఇది శివుడిని ఉగ్రరూపం దాల్చేలా చేసిందిని స్థల పురాణం చెబుతుంది.

అప్పుడు శివుడు బ్రహ్మ ఐదవ తలను తెంచడని పురాణం చెబుతుంది. ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి బ్రహ్మ ఈ క్షేత్రంలో తపస్సు చేశాడు.

భక్త ప్రహ్లాదుడు నరసింహ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి కొండపై తపస్సు చేశాడు. నరసింహ భగవానుడు తపస్సుతో సంతృప్తి చెందాడు.

నరసింహ స్వామిని ఇక్కడ కొలువై ఉండమని కోరగా భక్తులను అనుగ్రహించడానికి ఈ పవిత్ర కొండపై ఉండడానికి అంగీకరించాడు స్వామి.

ఇక్కడ కొలువై ఉన్న నరసింహ స్వామిని సేవించడానికి, దేవతలు ఈ పవిత్ర కొండపై రాళ్ళు మరియు చెట్ల రూపాలను ధరించారు.