Summer Health Care: మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

మండే ఎండలో ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో చాలా మంది ఉంటారు. అటువంటి వారు ఎండా వాన అని తేడాలేకుండా నిరంతరం కష్టపడుతుంటారు. వారికి సెలవులు కూడా ఉండవు. రోజు వారీ కూలీలు, ఉద్యోగస్థులు వేసవిలో ఎంత కష్టమైనా బయటికి వెళ్లాల్సిందే. కానీ ఎండలో బయటికి వెళ్లాక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. మండుతున్న ఎండలో..

Summer Health Care: మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
Summer Health Care
Follow us

|

Updated on: Apr 28, 2024 | 1:06 PM

మండే ఎండలో ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో చాలా మంది ఉంటారు. అటువంటి వారు ఎండా వాన అని తేడాలేకుండా నిరంతరం కష్టపడుతుంటారు. వారికి సెలవులు కూడా ఉండవు. రోజు వారీ కూలీలు, ఉద్యోగస్థులు వేసవిలో ఎంత కష్టమైనా బయటికి వెళ్లాల్సిందే. కానీ ఎండలో బయటికి వెళ్లాక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. మండుతున్న ఎండలో సన్ స్ట్రోక్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. నిరంతరం చెమటలు దారాపాతంగా కారిపోతుంటాయి. వేసవిలో వేయించిన ఆహారాలు, కారంతో కూడిన ఆహారాన్ని తింటే అజీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి ఆహారాలు తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఎండలో బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా తమతోపాటు ఒక నీళ్ల బాటిల్ బాటిల్‌ తీసుకెళ్లాలి. బస్సులో ఉన్నా, కాలినటకన వెళ్తున్నా తప్పకుండా నీల్ల బాటిల్‌ తీసుకెళ్లాలి. దాహంగా లేకున్నా అప్పుడప్పుడు నీరు త్రాగాలి. నీళ్లతో పాటు వీధిలో కొబ్బరి బోండాలు కనిపిస్తే వెంటనే వాటిని సేవించండి. అలాగే పెరుగు, తాజా పండ్ల రసం వంటి శీతల పానీయాలను కూడా ఈ సీజన్‌లో చాలా ఆరోగ్యకరమైనవి.

ఈ వేసవిలో ముదురు రంగు దుస్తులను వేసుకోవడం మానుకోవాలి. లేత రంగు దుస్తులు ధరించాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది. అలాగే, ఎండ నుంచి ముఖాన్ని రక్షించుకోవడానికి టోపీలు, సన్ గ్లాసెస్, గొడుగులను ఉపయోగించవచ్చు. ఎంద వేడి నుంచి రక్షణ పొందడానికి కాటన్ స్కార్ఫ్‌తో తల, ముఖాన్ని కవర్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

వేసవిలో టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. ఇందులోని కెఫిన్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. శీతల పానీయాలకు కూడా దూరంగా ఉండాలి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి సీజనల్ ఫ్రూట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి. పుచ్చకాయ, పైనాపిల్, దోసకాయ, పండిన బొప్పాయి వంటి వేసవి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో నీటి కొరత కూడా తీరుతుంది. వేసవిలో బయట దొరికే నూనె-మసాలా ఆహారాన్ని తీసుకోవడం నివారించాలి. ఇంట్లో వండిన భోజనం తినాలి. తేలికపాటి భోజనం తినడం ఇంకా మంచిది. ఈ వేసవిలో ప్రొటీన్లు, ప్రాసెస్డ్ ఫుడ్ తినకపోవడమే మంచిది. అవసరమైతే పెరుగు, పాంటా రైస్, పెరుగు అన్నం, పప్పు వంటి ఆహారాలు తినాలి. ఆహారంలో ఎక్కువ ద్రవం ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
15 రోజుల్లోనే తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ఫలితాలు!
15 రోజుల్లోనే తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ఫలితాలు!
వార్నీ ఇదేం పైత్యం తల్లి..! తినడానికి ముందు ప్లేట్‌ కడుగుతారు..
వార్నీ ఇదేం పైత్యం తల్లి..! తినడానికి ముందు ప్లేట్‌ కడుగుతారు..
గీతా గోవిందం సినిమాలో విజయ్‏ను ప్రేమించిన అమ్మాయి ఇలా మారిందేంటీ.
గీతా గోవిందం సినిమాలో విజయ్‏ను ప్రేమించిన అమ్మాయి ఇలా మారిందేంటీ.
బెంగళూరు, ఢిల్లీ పోరుకు వర్షం అడ్డంకి.. ఫలితం ఎలా నిర్ణయిస్తారు?
బెంగళూరు, ఢిల్లీ పోరుకు వర్షం అడ్డంకి.. ఫలితం ఎలా నిర్ణయిస్తారు?
రాజకీయాల్లోనే కాదు.. క్రీడల్లోనూ రేవంత్ మార్క్.. 54 ఏళ్ల వయస్సులో
రాజకీయాల్లోనే కాదు.. క్రీడల్లోనూ రేవంత్ మార్క్.. 54 ఏళ్ల వయస్సులో
అర్థరాత్రి వేళ పోలీసు తనిఖీలు.. చెక్ పోస్ట్ వద్ద భారీ నగదు..
అర్థరాత్రి వేళ పోలీసు తనిఖీలు.. చెక్ పోస్ట్ వద్ద భారీ నగదు..
కొరియన్ల వంటి గ్లాస్‌ స్కిన్‌ కోసం చియా సీడ్స్‌..! మెరిసే అందం
కొరియన్ల వంటి గ్లాస్‌ స్కిన్‌ కోసం చియా సీడ్స్‌..! మెరిసే అందం
ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించిన కత్రీనా కైఫ్..
ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించిన కత్రీనా కైఫ్..
కోల్‌కతా విజయంతో ఉత్కంఠగా ప్లేఆఫ్ రేసు.. సేమ్ పాయింట్లతో 3 జట్లు
కోల్‌కతా విజయంతో ఉత్కంఠగా ప్లేఆఫ్ రేసు.. సేమ్ పాయింట్లతో 3 జట్లు
నేడు పులివెందులకు సీఎం జగన్ దంపతులు.. ఓటు వేసేందుకు సిద్దం..
నేడు పులివెందులకు సీఎం జగన్ దంపతులు.. ఓటు వేసేందుకు సిద్దం..