పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
తృణధాన్యాలు, విత్తనాలను తినే ధోరణి ప్రస్తుత కాలంలో బాగా పెరిగింది.. ముఖ్యంగా విత్తనాలు మన రోజువారీ పోషకాలను సులభంగా చేరుకోవడానికి ఖచ్చితంగా సహాయపడుతాయి. వీటిని సాధారణ ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు.. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు వీటిని పలు మార్గాలలో తీసుకోవచ్చు..
Updated on: Apr 28, 2024 | 1:06 PM

తృణధాన్యాలు, విత్తనాలను తినే ధోరణి ప్రస్తుత కాలంలో బాగా పెరిగింది.. ముఖ్యంగా విత్తనాలు మన రోజువారీ పోషకాలను సులభంగా చేరుకోవడానికి ఖచ్చితంగా సహాయపడుతాయి. వీటిని సాధారణ ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు.. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు వీటిని పలు మార్గాలలో తీసుకోవచ్చు.. వేయించడం, నానబెట్టడం.. తినే ఆహారంలో చేర్చుకోవడం.. ఇలా పలు మార్గాలలో తీసుకోవచ్చు.. అలాంటి విత్తనాల్లో గుమ్మడి గింజలు ఒకటి.. గుమ్మడి గింజల్లో.. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ప్రొటీన్లు, మరెన్నో సమృద్ధిగా ఉంటాయి. ఈ విత్తనాలను వాటి ప్రయోజనాల దృష్ట్యా సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు.. కావున గుమ్మడికాయ గింజల ప్రయోజనాలేంటో తెలుసుకోండి..

మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది: గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.. నరాలు, కండరాల పనితీరులో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. న్యూరోట్రాన్స్మిటర్ కార్యకలాపాలను, కండరాల సంకోచాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ ఏర్పడటంతోపాటు.. కండరాల తిమ్మిరి, నొప్పులను నివారిస్తుంది.

బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది: గుమ్మడికాయ గింజలలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి బరువు నిర్వహణ ప్రయత్నాలకు మద్దతునించి తగ్గేలా చేస్తాయి. భోజనం తర్వాత తింటే.. కడుపు నిండుగా మారి.. అతిగా తినడాన్ని నియంత్రిస్తాయి.

ఆరోగ్యకరమైన కొవ్వులు: గుమ్మడికాయ గింజలు పిండి పదార్థాలు, ప్రొటీన్ల కంటే ఎక్కువ కొవ్వును అందిస్తాయి. అధ్యయనాల ప్రకారం, గుమ్మడికాయ గింజల్లోని కొవ్వులో ఎక్కువగా మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గట్ ఆరోగ్యానికి మంచిది: ఈ గింజల్లో ఉండే రిచ్ ఫైబర్ కంటెంట్ గట్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగు లైనింగ్‌ను పెంచి.. గ్యాస్ట్రిక్, క్రమరహిత ప్రేగు కదలికల సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇంకా గట్ నుంచి టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

పురుషుల సంతానోత్పత్తిని పెంచుతుంది: గుమ్మడికాయ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం పురుషులలో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. అవి జింక్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి శీఘ్రస్ఖలనం సమస్యలు, లైంగిక ప్రేరణతో సహా సంతానోత్పత్తి సమస్యలను పెంచడంలో సహాయపడతాయి.




