Summer Food: వేసవిలో రోజూ గుడ్డు తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఇంట్లో కూరగాయలు సమాయానికి లేకుంటే వెంటనే మనసు గుడ్డుపైకి లాగుతుంది. గుడ్డును ఆమ్లెట్ చేసినా, ఉడకబెట్టి తిన్నా అందులో పోషకాలలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే వేసవిలో రోజూ గుడ్లు తినొచ్చా? లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వేసవిలో తేలికపాటి ఆహారం తీసుకోవాలని, తద్వారా వేడి రోజులలో కూడా శరీరం చల్లగా ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. ఇలాంటి వేడి వాతావరణంలో గుడ్లు తినడం సురక్షితమేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Srilakshmi C

|

Updated on: Apr 28, 2024 | 12:35 PM

1 / 5
వేసవిలో తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మంచిది. అయితే సమ్మర్ డైట్ లో గుడ్లను తీసుకొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు సూపర్ ఫుడ్స్. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్ డి, బి, జింక్‌, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజు గుడ్డు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గుడ్లు చర్మం, జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణ సమస్యలు లేకుంటే రోజూ గుడ్లు తినవచ్చు.

2 / 5
కొన్నిసార్లు ఒకే రోజులో రెండు లేదా మూడు గుడ్లు తింటుంటాం. అయితే జీర్ణ రుగ్మతలు లేకుంటే రోజుకు రెండు గుడ్లు తినిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ వేసవిలో చాలా వేడిగా ఉంటుంది కాబట్టి, రోజులో ఎక్కువ గుడ్లు తినకపోవడమే మంచిది. వేసవిలో గుడ్లు తినకూడదని, కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. ఇది ఒక అపోహ మాత్రమే.

3 / 5
గుడ్డులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది నిజానికి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే వేసవిలో హెవీ ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది. కోడిగుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వేసవిలో గుడ్లు తింటే మంచిదే.

4 / 5
వేడి వాతావరణంలో తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మంచిది. గుడ్లు తినడం వల్ల ఎలాంటి హాని ఉండదు. అయితే గుడ్లు పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. వేసవిలో రోజుకు రెండు గుడ్ల కంటే ఎక్కువ తినకూడదు. గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు పెరుగుతాయి. వేసవిలో గుడ్లు తింటే చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంటుంది. ఫలితంగా బరువు సులభంగా తగ్గుతుంది. శరీరంలోని పోషకాహార లోపం కూడా తీరుతుంది. ఆరోగ్య సమస్యలు లేకుంటే రోజూ ఒక గుడ్డు తినవచ్చు.

5 / 5
Follow us