ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..
Coronavirus Impact: తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటివరకు ఏపిలో మూడు కోవిడ్ 19 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య ఐదుకు చేరింది. విజయవాడ, కాకినాడలలో చెరో పాజిటివ్ కేసు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఈ రెండు కేసులూ కూడా విదేశాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఓ వ్యక్తి లండన్ నుంచి రాగా.. మరో వ్యక్తి ఫ్రాన్స్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం […]
Coronavirus Impact: తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటివరకు ఏపిలో మూడు కోవిడ్ 19 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య ఐదుకు చేరింది. విజయవాడ, కాకినాడలలో చెరో పాజిటివ్ కేసు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఈ రెండు కేసులూ కూడా విదేశాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఓ వ్యక్తి లండన్ నుంచి రాగా.. మరో వ్యక్తి ఫ్రాన్స్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం వీరిని బోధనాసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక వీరిరువురూ విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరితో ఉన్నరాన్న దానిపై ఆరా తీస్తున్నారు. కాగా, వారి బంధువులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
For More News:
కోవిడ్ లక్షణాలు ఉండి.. ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరిస్తే చర్యలే..
కరోనా భయం.. జైలుకు నిప్పంటించిన ఖైదీలు…
కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు రాష్ట్రాలూ లాక్‌డౌన్..
తెలంగాణలో జనతా కర్ఫ్యూ.. ఆ సేవలకు మాత్రమే మినహాయింపు..
కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..
భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మరణాలు…
కరోనా కట్టడికి ఎబోలా మెడిసిన్ రెడీ.. ట్రయల్స్ షురూ..!
వైరస్ వణుకు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు నెలల రేషన్ ఫ్రీ..