Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhrapradesh: పిల్లలకు 2కి.మీల దూరం లోపలే బడి.. అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు

విద్యాశాఖ‌లో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింద‌ని.. ఈ క్ర‌మంలో ఒక్క స్కూల్ కూడా మూతపడకూడదని ఏపీ ముఖ్య‌మంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు.

Andhrapradesh:  పిల్లలకు 2కి.మీల దూరం లోపలే బడి.. అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు
Cm Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: May 19, 2021 | 5:52 PM

విద్యాశాఖ‌లో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింద‌ని.. ఈ క్ర‌మంలో ఒక్క స్కూల్ కూడా మూతపడకూడదని ఏపీ ముఖ్య‌మంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. విద్యా వ్యవస్థ ఆద‌ర్శంగా ఉండేలా కార్యాచరణను అమలు చేయాలని అధికారులకు సూచించారు. స్కూళ్ల నిర్వహణ, టీచర్ల వినియోగంలో అత్యున్న‌త‌ ప్రమాణాలు పాటించాలన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, అంగన్‌వాడీల్లో నాడు-నేడుపై ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పిల్లలకు 2కి.మీల దూరం లోపలే బడి ఉండాలన్నారు. విద్యార్థుల‌ సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండాలన్నారు. విద్యార్థులు తక్కువ.. టీచర్లు ఎక్కువ ఉన్న పాఠశాలల్లో అంగన్‌వాడీ పిల్లలను కలుపుకొనేలా చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. అవకాశం ఉన్నచోట మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్నత పాఠశాల పరిధిలోకి తీసుకురావాలని వివ‌రించారు. అధికారుల ప్రతిపాదనలు పరిశీలించిన ముఖ్య‌మంత్రి.. రాష్ట్రంలో ప్రతి పాఠశాల వినియోగంలో ఉండాలన్నారు.

అవసరమైనచోట అదనపు గదులు నిర్మించాలని సీఎం ఆదేశించారు. గ‌వ‌ర్న‌మెంట్ తీసుకొస్తున్న మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకమని, వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకొని మంచి పనితీరు రాబట్టుకోవాలన్నారు. అంగన్‌వాడీ ఉపాధ్యాయుల కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ రూపొందించిన స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పుస్తకం, సీడీలను ముఖ్య‌మంత్రి ఆవిష్కరించారు.

Also Read:  కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. గర్బిణిలు, కోవిడ్‌తో కోలుకున్నవారు టీకా ఎప్పుడు తీసుకోవాలంటే..!

ఆ గ్రామాన్ని వణికిస్తున్న మాయరోగం, 27 రోజుల వ్యవధిలో 36 మంది మృతి.. కరోనా కాదట..!