చంద్రగిరికి, చంద్రబాబుకు లింక్.. రీపోలింగ్ రేపిన చిచ్చు.!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీ-పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఈ నిరసన చేయనున్నారట. ఆ ప్రకారం ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరాకు అధికారక పత్రాన్ని చంద్రబాబు ఇవ్వనున్నారు. రీ-పోలింగ్ కు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న డిమాండ్ ను ఆమోదించి.. టీడీపీ చేస్తున్న డిమాండ్ ను తిరస్కరించడంలో ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి చూపిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.  టీడీపీ వర్గాల సమాచారం […]

చంద్రగిరికి, చంద్రబాబుకు లింక్.. రీపోలింగ్ రేపిన చిచ్చు.!
Follow us

|

Updated on: May 17, 2019 | 4:08 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీ-పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఈ నిరసన చేయనున్నారట. ఆ ప్రకారం ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరాకు అధికారక పత్రాన్ని చంద్రబాబు ఇవ్వనున్నారు.

రీ-పోలింగ్ కు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న డిమాండ్ ను ఆమోదించి.. టీడీపీ చేస్తున్న డిమాండ్ ను తిరస్కరించడంలో ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి చూపిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.  టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు ఈసీ నిర్ణయంపై ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తారని తెలుస్తోంది.

ఏప్రిల్ 11న ఒక సామజిక వర్గానికి చెందిన వారు ఓటు వేయకుండా టీడీపీ అడ్డుపడిందని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉంటే చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ బుధవారం నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్ మే 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

మరోవైపు మే 6న ఏపీలోని మూడు జిల్లాల్లో ఉన్న ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరిగింది. ఇక 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు మొదటి విడతగా ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఆదివారం జరగనున్న రీ పోలింగ్ నేపథ్యంలో చంద్రగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ సరళిపై ప్రభావం చూపేందుకు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ప్రయత్నిస్తున్నాడని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నారు.

Latest Articles
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్