గాడ్సేని మించిన రాజీవ్ గాంధీ.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

మహాత్మాగాంధీని తుపాకీతో కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దేశభక్తుడంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఆమె వెనక్కి తగ్గింది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో బీజేపీ నేత ఇవాళ నోరు పారేసుకున్నారు. నాథూరాం గాడ్సే కేవలం ఒక్కరినే చంపాడనీ, కానీ కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఏకంగా 17,000 మందిని పొట్టనపెట్టుకున్నారని కర్ణాటక బీజేపీ నేత నలిన్ కుమార్ కతీల్ ఆరోపించారు. ‘నాథూరాం […]

గాడ్సేని మించిన రాజీవ్ గాంధీ.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 17, 2019 | 1:56 PM

మహాత్మాగాంధీని తుపాకీతో కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దేశభక్తుడంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఆమె వెనక్కి తగ్గింది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో బీజేపీ నేత ఇవాళ నోరు పారేసుకున్నారు. నాథూరాం గాడ్సే కేవలం ఒక్కరినే చంపాడనీ, కానీ కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఏకంగా 17,000 మందిని పొట్టనపెట్టుకున్నారని కర్ణాటక బీజేపీ నేత నలిన్ కుమార్ కతీల్ ఆరోపించారు.

‘నాథూరాం గాడ్సే ఒకరినే చంపాడు, ముంబై మారణహోమంలో పాక్ ఉగ్రవాది కసబ్ 72 మంది అమాయకులను హతమార్చాడు. కానీ రాజీవ్ గాంధీ ఏకంగా 17,000 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ మూడు ఘటనల్లో ఎవరు క్రూరులో మీరే నిర్ణయించుకోండి’ అని ప్రజలను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ట్వీట్ మరో సంచలనంగా మారింది.

దీంతో ఆయనపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. చివరికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ట్వీట్‌ను గుట్టుచప్పుడు కాకుండా తొలగించారు. అనంతరం తన ట్వీట్ ఎవరినైనా నొప్పించి ఉంటే.. అందుకు క్షమాపణ కొరుతున్నానని పేర్కొంటూ మరో ట్వీట్ చేశారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!