ఢిల్లీలో రేషన్ హోమ్ డెలివరీని నిలిపివేసిన కేంద్రం….. ఇది రాజకీయ కక్షేనంటున్న ఆప్ నేతలు
కేంద్రానికి, ఢిల్లీకి మధ్య రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. నగరంలో రేషన్ హోమ్ డెలివరీని నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వచ్చేవారం నుంచి ఈ పథకాన్ని అమలు చేయరాదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించినట్టు తెలుస్తోంది.
కేంద్రానికి, ఢిల్లీకి మధ్య రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. నగరంలో రేషన్ హోమ్ డెలివరీని నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వచ్చేవారం నుంచి ఈ పథకాన్ని అమలు చేయరాదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. నిజానికి నగర వ్యాప్తంగా ఒకటి రెండు రోజుల్లో దీన్ని అమలు చేయాలనీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్తజుండి. కానీ రేషన్ హోమ్ డెలివరీ పథకానికి సంబంధించిన ఫైలును లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించారు. మొదట దీన్ని తాను ఆమోదించాల్సి ఉందని, పైగా ఇది కోర్టు కేసులో ఉందని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.. ప్రస్తుత చట్టం ప్రకారం ఈ పథకాన్ని అమలు చేయజాలమని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కోర్టు కేసు పరిష్కారమయ్యేంత వరకు ఇది అమలు కాబోదని ఆయన పేర్కొన్నట్టు చెబుతున్నారు. కాగా ప్రధాని మోదీ ఆదేశం మేరకే రేషన్ హోమ్ డెలివరీని నిలిపివేశారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు ట్వీట్ చేస్తూ ఢిల్లీలోని సుమారు 70 లక్షల మంది పేదలకు ఇక ఈ పథకం ద్వారా రేషన్ హోమ్ డెలివరీ సౌకర్యం ఉండబోదని వారు అన్నారు. అయితే మొదట ఈ ప్రతిపాదనపై తనతో చర్చించాల్సి ఉండిందని లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయపడినట్టు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
మరో వైపు పేదల సాయం కోసం తాము ప్రతిస్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టామని, అవసరమైతే దీని అమలుకోసం కోర్టుకెక్కుతామని ఆప్ వర్గాలు వెల్లడించాయి. మరి కొన్ని రోజుల్లో ఈ సమస్యను కోర్టు పరిష్కరించగలదని ఆశిస్తున్నట్టు ఆప్ నేతలు పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: యాదాద్రిపై కరోనా ప్రభావం నారసింహ బయట పడేది ఎలా..?:Corona Effect on Yadadri Temple live video.