NPS: ఎన్‌పీఎస్ స్కీమ్‌లో రోజు రూ.150 ఇన్వెస్ట్ చేయండి.. 60 ఏళ్ల తర్వాత రూ.1 కోటి, నెలకు రూ.27 వేల పెన్షన్
National Pension System: పదవీ విమరణ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలని భావించే వారికి ఇది శుభవార్తే. వారి కోసం అదిరిపోయే స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది..
National Pension System: పదవీ విమరణ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలని భావించే వారికి ఇది శుభవార్తే. వారి కోసం అదిరిపోయే స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది. అదే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). ఇందులో చేరితే ప్రతి నెలా డబ్బులు వస్తాయి. అంతేకాకుండా ఒకేసారి భారీ మొత్తం వస్తుంది. ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరితే పదవీ విరమణ తర్వాత అంటే 60 ఏళ్ల తర్వాత ప్రతినెలా డబ్బులు వస్తాయి. మీరు ప్రతి నెలా డబ్బులు కడుతూ ఉండాలి. ఇలా 60 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు కడుతుంటే.. ఆ తర్వాత నుంచి మీకు ప్రతి నెలా డబ్బులు వస్తాయి. ఒకేసారి భారీ మొత్తం వస్తుంది. రోజుకు రూ.150 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే పదవీ విరమణ తర్వాత కోటి రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. ఉదాహారణకు.. మీరు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు రోజుకు 150 రూపాయల చొప్పున నెలకు రూ.4,500 ఎన్‌పీఎస్‌లో అన్వెస్ట్ చేయండి. 60 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చేస్తారు. అంటే మీరు 35 ఏళ్ల పాటు పెట్టుబడి పెడుతారన్నట్లు. ఇప్పుడు మీకు కనీసం 8 శాతం వడ్డీ చొప్పున మీరు నెలకు రూ.27 వేల చొప్పున పెన్షన్ అందుకోవచ్చు. ఒకేసారి కావాలనుకుంటే కోటి రూపాయల వరకు వస్తుంది. మీరు ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో నుంచే ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరొచ్చు. దీని కోసం మీరు ఎన్‌పీఎస్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. స్కీమ్‌లో డైరెక్ట్‌గా చేరవచ్చు. అయితే దీనికి మీ ఆధార్ కార్డు కచ్చితంగా కావాలి. అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. లేదంటే స్కీమ్‌లో చేరడం కుదరదు. అయితే సాధారణంగా 75శాతం వరకు డబ్బు ఈక్విటీలోకి వెళ్లవచ్చు. దీని అర్థం పీపీఎఫ్ లేదా ఈపీఎఫ్ కంటే కొంచెం ఎక్కువ రాబడి పొందుతారని అర్థం.
ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి ప్రారంభం:
వయసు 25 సంవత్సరాలు ప్రతినెల రూ.4500 పెట్టుబడి పదవీ కాలం 35 సంవత్సరాలు అంచనా రాబడి 8 శాతం
మొత్తం పెట్టుబడులు రూ.18.90 లక్షలు మొత్తం వడ్డీ రూ.83.67 లక్షలు పెన్షన్ మొత్తం రూ.1.02 కోట్లు మొత్తం పన్ను ఆదా రూ.5.67 లక్షలు
ఇప్పుడు మీరు ఈ డబ్బును ఒకేసారి ఉపసంహరించుకోలేరు. మీరు దానిలో 60 శాతం మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన 40 శాతం మీరు యాన్యుటీ ప్లాన్‌లో ఉంచాలి. దాని నుంచి ప్రతి నెల మీకు పెన్షన్ అందుతుంది. మీరు మీ డబ్బులో 40శాతం యాన్యుటీలో ఉంచారని అనుకుందాం.. మీరు ఒకే మొత్తాన్ని రూ.61.54 లక్షలు ఉపసంహరించుకోగలుగుతారు. వడ్డీ 8శాతం అనుకుంటే ప్రతి నెల రూ.27 వేల వరకు వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మేము ఇక్కడ ఉదాహరణగా మాత్రమే అంచనా వేశాము. వివరాలు అందుకు భిన్నంగా కూడా ఉండవచ్చు అని భావించాలి.