AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th pay commission: కేంద్ర ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. జూలై నుంచి పెరగనున్న డీఏ.. భత్యం పెరిగినా భారీ నష్టం..!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల కోసం భారత ప్రభుత్వం సరళమైన, సురక్షితమైన కుటుంబ పెన్షన్ నియమాలను ప్రవేశపెట్టింది.

7th pay commission: కేంద్ర ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. జూలై నుంచి పెరగనున్న డీఏ.. భత్యం పెరిగినా భారీ నష్టం..!
Pay Commission Dearness Allowance
Balaraju Goud
|

Updated on: Jun 05, 2021 | 9:25 PM

Share

Government Employees Dearness Allowance: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల కోసం భారత ప్రభుత్వం సరళమైన, సురక్షితమైన కుటుంబ పెన్షన్ నియమాలను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షన‌ర్ల‌కు రిలీఫ్ ల‌భించ‌నున్నది‌. వ‌చ్చే జూలై ఒక‌టో తేదీ నుంచి వారికి క‌రువు భ‌త్యం (డీఏ) చెల్లింపులు అమ‌లులోకి రానున్నది. మూడు వాయిదాల డీఏను జూలై ఒక‌టో తేదీ నుంచి చెల్లిస్తామ‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగికి దాదాపు ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయిన భత్యం జూలై నెలలో అందే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సైతం జవనరి 1, 2020, జూలై 1, 2020 తేదీన మరియు జవవరి 1, 2021 ఇలా మూడు దఫాలలో చెల్లించాల్సిన డీఏ(Dearness Allowances), డియర్‌నెస్ రిలీఫ్(Dearness Relief) పెండింగ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ నిలిపివేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

తాజాగా డియర్‌నెస్ భత్యం ఇప్పుడు 17 శాతానికి బదులుగా 28 శాతంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏడ‌వ వేత‌న స‌వ‌ర‌ణ క‌మిష‌న్ సిఫారసుల ప్రకారం వారి డీఏ పెరుగ‌నున్నది. కరోనా మహమ్మారి కారణంగా, ప్రభుత్వ ఉద్యోగుల భత్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. జనవరి 1, 2020, జూలై 1, 2020 న ప్రభుత్వం ద్రవ్యోల్బణ భత్యాలను చెల్లించలేదు. ఈ సంవత్సరం కూడా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర ఖజానా ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఫలితంగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు రెట్టింపు నష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.

కోవిడ్ 19సంక్షోభం కారణంగా జూలై 2021 వరకు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 61 లక్షల మంది పింఛన్‌దారులకు డియర్‌నెస్ అలవెన్స్ నిలుపుదల చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత ఏడాది ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకుంది. దాదాపు 18 నెలలుగా ఉద్యోగులకు డీఏ ప్రకటించలేదు. ఫలితంగా కనీస వేతనం రూ .10,000 ఉన్న ఉద్యోగులు సుమారు రూ .2.88 లక్షలు కోల్పోవల్సి వస్తోంది. 7వ వేతన సంఘం అంచనాల ప్రకారం 10 వేల గ్రేడ్ ప్రభుత్వ ఉద్యోగులు 2 లక్షలకు పైగా నష్టాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు. కానీ ప్రస్తుతం కరోనా ప్రభావం, వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దీంతో ఇప్పుడు జూలైలో ప్రభుత్వం ఈ ఉద్యోగులకు శుభవార్త అందిస్తోంది.

కేంద్ర ఉద్యోగుల నష్టం ఎలా జరిగింది? రూ .10,000 గ్రేడ్ జీతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, అంటే వారు ప్రాథమిక వేతన పరిధి 1,44,200 రూపాయల నుండి 2,18,200 రూపాయలకు వస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగుల భత్యం జనవరి 1, 2020 నుండి జూన్ 2020 వరకు రూ .34,608 నుండి రూ .52,368 వరకు ఉంటుంది. ఆ తరువాత 2020 జూలై 1 నుండి 2020 డిసెంబర్ 31 వరకు వచ్చే 6 నెలల వాయిదాల మొత్తం రూ .60,564 నుండి రూ .91,644 వరకు ఉంటుంది. ఈ లెక్కన డీఏ ఇంకా బాకీ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 7 నెలలు అంటే 2021 జనవరి 1 నుండి 2021 జూన్ 30 వరకు రూ .95,172 నుంచి రూ .1,44,012 వరకు ఉంటాయి. ఈ ఆరు నెలల్లో మూడు విడతలు కలిపితే, రూ .1,90,344 నుండి రూ .2,88,024 అవుతుంది. అంటే ఈ పదివేల బ్రాకెట్‌లోకి వచ్చే ప్రభుత్వ ఉద్యోగి 18 నెలల్లో మొత్తం రూ .2.88 లక్షలు కోల్పోతున్నాడు.

ప్రస్తుతం, ద్రవ్యోల్బణ భత్యం 17 శాతం జూలై 1, 2021 నుండి ద్రవ్యోల్బణ భత్యం 28 శాతానికి పెరుగుతుందని చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం ఇది 17 శాతంగానే ఉంది. భత్యం ప్రాథమిక చెల్లింపు ఆధారంగా లెక్కించబడుతుంది. ద్రవ్యోల్బణ భత్యంతో ప్రయాణ భత్యం కూడా పెరుగుతుంది. అందువల్ల, డీఏ పెరిగినప్పుడు, ట్రావెలింగ్ అలవెన్స్ (టిఎ) కూడా పెరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే డీఏ, టీఏల పెరుగుదల వారి నికర సీటీసీని కూడా పెంచుతుంది.

జనవరి 1, 2020 నుండి ద్రవ్యోల్బణ భత్యం పెంచలేదు. అంతే కాదు, 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు బకాయిలు చెల్లించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందువల్ల కేంద్ర ఉద్యోగులకు బకాయిలు కూడా రావు. అయితే, జూలై 1 నుంచి కేంద్ర ఉద్యోగుల కోసం లాటరీ జరగడం ఖాయంగా కనిపిస్తుంది.

గత సంవత్సరం నిలిచిన ద్రవ్యోల్బణ భత్యం  కరోనా మహమ్మారి కారణంగా, గత ఏడాది జనవరి 1, 2020 నుండి ద్రవ్యోల్బణ భత్యం పెంచలేదు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి రూ .37,000 కోట్లు ఆదా అయ్యాయి. అయితే, ఇప్పుడు ఉద్యోగులు డీఏ బకాయిలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, బకాయిలు అందవని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు స్పష్టం చేసింది. జూలై 2021 లో తీసుకోబోయే ఈ నిర్ణయం దశలవారీగా అమలు చేస్తామని తెలిపింది. అందువల్ల, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఇప్పుడు జూలై 1 కోసం ఎదురు చూస్తున్నారు.

Read Also…  Indian Railways: ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్ రైల్వే రికార్డు దిశలో దూసుకు పోతున్న ఇండియన్ రైల్వేస్

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం