యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దెబ్బ తిన్న పర్యావరణం…..మొక్కలు ఎన్ని నాటారో చెప్పాలన్న సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్
యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పర్యావరణం తీవ్రంగా దెబ్బ తిన్నదని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన..
యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పర్యావరణం తీవ్రంగా దెబ్బ తిన్నదని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ రాష్ట్రంలో చెట్లు కేవలం ప్రభుత్వ ఫైళ్లలో మాత్రమే ‘పెరుగుతున్నాయని’ ఎద్దేవా చేశారు. పర్యావరణ పరిరక్షణపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, ప్రతి ఏడాదీ ట్రీ ప్లాంటేషన్ పేరిట తప్పుడు లెక్కలు చెబుతోందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఎన్విరాన్ మెంట్ దెబ్బ తిన్నదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తన నాయకత్వం కింద ముఖ్యంగా బుందేల్ ఖండ్ ప్రాంతంలో గ్రీన్ పార్కులు ఎలా ఏర్పాటు చేశామో అందరికీ తెలిసిందేనన్నారు. ఆ సందర్భంగా గిన్నెస్ బుక్ రికార్డులకు కూడా ఎక్కామని అఖిలేష్ యాదవ్ గుర్తు చేశారు. కాగా జులై మొదటివారం నుంచి ప్రారంభించి ఈ సంవత్సరం 30 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకు గాను ఈ నెల 15 కల్లా ల్యాండ్ ను గుర్తించాలని తాము అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లను ఆదేశించినట్టు ఆయన చెప్పారు.
వచ్చే నెల మొదటివారం నుంచి అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులకు మొక్కలు పంపిణీ చేయాలని వారిని కోరినట్టు ఆయన చెప్పారు. ఇలా ఉండగా ఇండియా క్లైమేట్ జస్టిస్ గా ఎదుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ దేశంలో 2025 నాటికి ఈథనాల్ బ్లెండింగ్ పై నిపుణుల కమిటీ రూపొందించిన రోడ్ మ్యాప్ నివేదికను ఆయన శనివారం రిలీజ్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: యాదాద్రిపై కరోనా ప్రభావం నారసింహ బయట పడేది ఎలా..?:Corona Effect on Yadadri Temple live video.