మీరు కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు తీసుకున్నారా ..? అయితే మళ్ళీ టీకామందులు వేయించుకోవలసిందే ! విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీల ‘హెచ్చరిక’
అమెరికాలోని వివిధ యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు సమస్య వచ్చి పడింది. వీరు కొవాగ్జిన్ లేదా స్పుత్నిక్ టీకామందులు తీసుకుని ఉంటే ..
అమెరికాలోని వివిధ యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు సమస్య వచ్చి పడింది. వీరు కొవాగ్జిన్ లేదా స్పుత్నిక్ టీకామందులు తీసుకుని ఉంటే ..ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన వ్యాక్సిన్ ను మళ్ళీ తీసుకోవాలని ఈ యూనివర్సిటీల అధికారులు కోరుతున్నారు. ఈ రెండు వ్యాక్సిన్ల సేఫ్టీ, నాణ్యతకు సంబంధించి వీరి వద్ద తగినంత డేటా లేకపోవడమే కారణమని తెలుస్తోంది. తమ సెమిస్టర్ ప్రారంభమయ్యేలోగా స్టూడెంట్స్ కొత్త’ వ్యాకిన్స్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే మళ్ళీ ఇలా తీసుకుంటే తమ ఆరోగ్యం విషయంలో సేఫ్టీ ఉంటుందా అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న మిలోనీ దోషి అనే విద్యార్థిని తాను ఇండియాలో రెండు డోసుల కొవాగ్జిన్ తీసుకున్నానని, ఇప్పుడు మళ్ళీ ఈ టీకామందుల ‘గోల’ ఏమిటని వాపోయింది. నువ్వే నీ సెమిస్టర్ కి హాజరయ్యే ముందే మరో వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు ఆదేశించారని ఆమె వెల్లడించింది.
ప్రతి ఏడాదీ సుమారు 2 లక్షలమంది తమ స్టడీస్ కోసం అమెరికాకు వెళ్తుంటారు. ఇంతకీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన వ్యాక్సిన్లు బహుశా మోడెర్నా , ఫైజర్ టీకామందులే అయి ఉంటాయని భావిస్తున్నారు. అయినా ఇండియాలో తాము తీసుకున్న కోవాగ్జిన్ లేదా స్పుత్నిక్ వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకు ఎందుకు ఆమోదించలేదన్న ప్రశ్నకు సమాధానం లభించలేదు. యూఎస్ యూనివర్సిటీల నిర్ణయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: యాదాద్రిపై కరోనా ప్రభావం నారసింహ బయట పడేది ఎలా..?:Corona Effect on Yadadri Temple live video.