వీధి కుక్కల దాడి..తల్లి కళ్లముందే ఆరేళ్ల బాలుడు మృతి

భోపాల్‌‌లో వీధి కుక్కలు వీరవిహారం చేశాయి.  వాటి దాడిలో ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. అడ్డుకునేందుకు చిన్నారి తల్లి ప్రయత్నించినప్పటికీ శునకాలు ఆ బాలుడిని వదిలిపెట్టలేదు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భోపాల్‌లోని అవాధ్‌పురి ప్రాంతంలో సంజు అనే ఆరేళ్ల చిన్నారి ఆడుకునేందుకు తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లాడు. బాలుడి తల్లికి గత నెల్లోనే డెలివరీ కావడంతో ఇంట్లో రెస్ట్‌ తీసుకుంటోంది. ఆఫీస్‌ నుంచి ఇంటికొచ్చిన చిన్నారి […]

వీధి కుక్కల దాడి..తల్లి కళ్లముందే ఆరేళ్ల బాలుడు మృతి
Follow us

| Edited By: Srinu

Updated on: May 11, 2019 | 6:34 PM

భోపాల్‌‌లో వీధి కుక్కలు వీరవిహారం చేశాయి.  వాటి దాడిలో ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. అడ్డుకునేందుకు చిన్నారి తల్లి ప్రయత్నించినప్పటికీ శునకాలు ఆ బాలుడిని వదిలిపెట్టలేదు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భోపాల్‌లోని అవాధ్‌పురి ప్రాంతంలో సంజు అనే ఆరేళ్ల చిన్నారి ఆడుకునేందుకు తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లాడు. బాలుడి తల్లికి గత నెల్లోనే డెలివరీ కావడంతో ఇంట్లో రెస్ట్‌ తీసుకుంటోంది. ఆఫీస్‌ నుంచి ఇంటికొచ్చిన చిన్నారి తండ్రి.. సంజు గురించి అడగడంతో ఆమె బయటకు వెళ్లి చూడగా వీధి కుక్కలు దాడి చేస్తూ కన్పించాయి. ఒక్కసారిగా భయపడిపోయిన ఆ తల్లి వెంటనే అరుస్తూ కుమారుడిని కాపాడే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ శునకాలు సంజూను వదలకుండా దాడిచేశాయి.

సంజూ తల్లి అరుపులతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి కుక్కలను తరిమికొట్టారు. అయితే అప్పటికే చిన్నారి తీవ్ర గాయాలతో స్పృహకోల్పోయి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే సంజూ ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.