Srinagar: భూతల స్వర్గం శ్రీనగర్ కి వెళ్తున్నారా… సమీపంలోని ఈ ప్రదేశాలను చూడకపోతే టూర్ అసంపూర్ణం..
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ దాని సహజ సౌందర్యంతో భూతల స్వర్గంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి అందమైన సరస్సులలో హౌస్ బోట్‌లో బస చేసే అనుభవం భిన్నంగా ఉంటుంది. దీనితో పాటు, మొఘల్ తోటలు సహా చాలా అందమైన ప్రదేశాలను ఈ నగరంలో అన్వేషించవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో శ్రీ నగర్ ను సందర్శించడం జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని లాల్ చౌక్ క్లాక్ టవర్ అక్కడికి వెళ్ళే పర్యాటకులకు ఒక ముఖ్యమైన ఆకర్షణగా మారింది. ఇది అందంతో పాటు చారిత్రక , రాజకీయ ప్రాముఖ్యతతో ప్రసిద్ధి చెందింది. మార్చి నుంచి అక్టోబర్ వరకు ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది కాశ్మీర్‌ను సందర్శిస్తారు. అయితే వర్షాకాలంలో కశ్మీర్‌లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రీనగర్ ఘంటా ఘర్ సమీపంలో పర్యాటకులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. ఇప్పుడున్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎవరైనా కాశ్మీర్‌లోని శ్రీనగర్‌ను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే సమీపంలోని ఈ అందమైన ప్రదేశాలను కూడా చూడడం మరచిపోకండి.
శ్రీనగర్ లో సందర్శించాల్సిన ప్రదేశాలు
దాల్ సరస్సు: శ్రీనగర్ కే దాల్ సరస్సు ఒక ఆకర్షణ. ఇది షికారా రైడ్స్ తో చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని “ఫ్లవర్స్ లేక్” అనీ, “శ్రీనగర్ జ్యువెల్”” అని కూడా పిలుస్తారు. ఈ సరస్సు దాని అందం, హౌస్ బోట్లు, తేలియాడే మార్కెట్లు, షికారాలతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం అందం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. దాల్ సరస్సు అన్ని వైపులా పర్వతాలతో చుట్టుముట్టబడి ఉంది. సరస్సులోని హౌస్ బోట్ పర్యాటకులకు గొప్ప అనుభవాన్ని అందిస్తుంది.
షాలిమార్ బాగ్: శ్రీనగర్‌లోని దాల్ సరస్సు సమీపంలో ఉన్న షాలిమార్ బాగ్ ఒక ప్రసిద్ధ మొఘల్ ఉద్యానవనం. దీనిని జహంగీర్ చక్రవర్తి తన భార్య నూర్ జహాన్ కోసం నిర్మించాడు. ఇక్కడ అనేక రకాల విదేశీ పువ్వులు, చినార్ చెట్లను చూడవచ్చు. దీనితో పాటు ఈ తోటలో జలపాతాలు, ఫౌంటెన్లు, అందమైన కాలువలు కనిపిస్తాయి. ఇది శ్రీనగర్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది మూడు టెర్రస్‌లుగా విభజించబడింది, దీనిలో అత్యల్ప టెర్రస్‌ను దివాన్-ఎ-ఆమ్ అని పిలుస్తారు.
నాగిన్ సరస్సు: శ్రీనగర్‌లో ఉన్న ఒక ప్రసిద్ధ సరస్సు నాగిన్ సరస్సు. దీనినే నిజీన్ సరస్సు అని కూడా పిలుస్తారు. ఈ సరస్సులోని నీరు స్పష్టంగా ఉంటుంది. మనోహరంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా హౌస్ బోట్ అద్దెకు తీసుకునే అవకాశం లభిస్తుంది. అన్ని వైపులా ఎత్తైన పర్వతాలు, చెట్లతో చుట్టుముట్టబడిన ఈ సరస్సు అందం దాల్ సరస్సు కంటే తక్కువ కాదు. అందుకే ఇక్కడికి కూడా వెళ్ళవచ్చు.
శ్రీనగర్ దగ్గర సందర్శించాల్సిన ప్రదేశాలు శ్రీనగర్ సమీపంలో సందర్శించడానికి ఇంకా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. 52 కి.మీ దూరంలో ఉన్న గుల్మార్గ్. శ్రీనగర్ నుంచి 80 కి.మీ దూరంలో ఉన్న సోనామార్గ్, పహల్గామ్ , యుస్మార్గ్ వంటి ఇతర అందమైన ప్రాంతాలను చూడవచ్చు.
శ్రీనగర్ సందర్శించడానికి ఉత్తమ సమయం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు. ఈ సమయంలో ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ భారీ హిమపాతం ఉంటుంది. ఇక్కడ హౌస్ బోట్‌లో బస చేయడమే కాదు సమీపంలోని చాలా అందమైన ప్రదేశాలను అన్వేషించే అవకాశం లభిస్తుంది. దీనితో పాటు పోలో వ్యూలో షాపింగ్ చేయవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








