AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel India: వర్షాకాలంలో ఈ గ్రామాల అందాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు.. ఆసియాలో పరిశుభ్రమైన గ్రామాలుగా ప్రసిద్ది..

వర్షాకాలంలో అందమైన ప్రదేశాలను సందర్శించడంలో ఉండే ఆనందం వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉన్న అనేక కొండ ప్రాంతాలు ఉన్నాయి. అయితే వర్షాకాలంలో విభిన్నమైన అందంతో ఆకర్షించే ప్రదేశాలు భారతదేశంలో గొప్ప గ్రామాలున్నాయి. ఈ గ్రామాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని చెబుతారు ప్రకృతి ప్రేమికులు

Travel India: వర్షాకాలంలో ఈ గ్రామాల అందాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు.. ఆసియాలో పరిశుభ్రమైన గ్రామాలుగా ప్రసిద్ది..
Travel India
Surya Kala
|

Updated on: Jul 10, 2025 | 4:33 PM

Share

వర్షాకాలంలోని ప్రకృతి అందాలను గురించి ఎంత చెప్పినా.. ఎంత వర్ణించినా తక్కువే అనిపిస్తుంది. భారతదేశంలో కొన్ని గ్రామాలు ఈ సమయంలో మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఈ గ్రామాలు అందంలో ముందంజలో ఉండటమే కాదు పరిశుభ్రమైన గ్రామాల జాబితాలో కూడా చేర్చబడ్డాయి. కొన్ని గ్రామాలు అంతర్జాతీయ స్థాయిలో ఆసియాలోని అత్యంత పరిశుభ్రమైన గ్రామం వంటి బిరుదులను కూడా పొందాయి. నిజంగా ఈ గ్రామాలు స్వర్గం కంటే తక్కువ కాదనిపిస్తాయి. మేఘాలయలోని మావ్లిన్నోంగ్ గ్రామం అయినా లేదా హిమాచల్ ప్రదేశ్‌లోని నోక్ గ్రామం అయినా వర్షాకాలంలో ఈ గ్రామాల అందం భూతల స్వర్గాన్ని తలపిస్తాయి.

వర్షపు జల్లులు, పచ్చని లోయలు, స్వచ్ఛమైన గాలి ఈ గ్రామాలను సినిమా దృశ్యంలా కనిపించేలా చేస్తాయి. ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పెద్ద పెద్ద నగరాల్లో వలనే జనసమూహం, కాలుష్యం ఉండదు. ఈ గ్రామాల సరళత, పరిశుభ్రత, సహజ సౌందర్యం ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ వర్షాకాలంలో మానసిక ప్రశాంతత పొందాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రామాలను సందర్శించండి. భారతదేశంలోని ఆ 4 గ్రామాల గురించి తెలుసుకుందాం.. ఇవి పరిశుభ్రత, సహజ సౌందర్యంలో నంబర్ వన్ గా పరిగణించబడతాయి.

ఇవి కూడా చదవండి

మేఘాలయలోని మావ్లిన్నోంగ్ గ్రామం మేఘాలయలోని మావ్లిన్నాంగ్ గ్రామం ఆసియాలోని అత్యంత పరిశుభ్రమైన గ్రామాలలో ఒకటి. ఈ గ్రామం పరిశుభ్రత, పర్యావరణ అనుకూల పద్ధతులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి వీధి శుభ్రంగా ఉంటుంది. ప్రతి ఇంటి వెలుపల ఒక చెత్తబుట్ట ఉంటుంది. వర్షాకాలంలో ఈ గ్రామం ఒక అద్భుత కథలా కనిపిస్తుంది. వర్షాకాలంలో ఇక్కడ మేఘాలతో కప్పబడిన పర్వతాలు, పచ్చదనం, చల్లని గాలిని అనుభవిస్తారు. మీరు ఇక్కడికి వెళ్తే లివింగ్ రూట్ బ్రిడ్జి, శుభ్రమైన నడక మార్గం, జలపాతాలు, వెదురు ఇళ్లను చూడటం మర్చిపోవద్దు.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

హిమాచల్ ప్రదేశ్ స్పితి లోయలో ఉన్న నాకో గ్రామం

స్పితి ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ చిన్న గ్రామం వర్షాకాలంలో చాలా ప్రశాంతంగా, అందంగా మారుతుంది. ఈ ప్రదేశం సంస్కృతి, అందం రెండూ ఆత్మను ప్రశాంతపరుస్తాయి. ఇక్కడి ప్రజలు బౌద్ధ సంస్కృతిని అనుసరిస్తారు. ఇక్కడ మేఘాలతో చుట్టుముట్టబడిన పర్వతాలను, వర్షాకాలంలో చల్లని, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చు. ఇక్కడ చూడటానికి కొన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడ సాంప్రదాయ ఇళ్ళు, మంచు శిఖరాలు, స్థానిక బౌద్ధ ఆరామాలను చూడడం ఓ అందమైన జ్ఞాపకం.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

కేరళలోని ఇడుక్కి కూడా అద్భుతమైనది. వర్షాకాలంలో కేరళలోని ఈ ప్రాంతం మరింత అందంగా మారుతుంది. వర్షాకాలంలో, ఇడుక్కి లోయలు ఆకుపచ్చ వెల్వెట్ షీట్‌ను సంతరించుకుంటాయి. జలపాతాల ప్రతిధ్వని పర్యావరణాన్ని సంగీతభరితంగా మారుస్తుంది. ఈ ప్రదేశం ప్రత్యేకత దాని పచ్చదనం, కొండ ప్రాంతం, జలపాతాలు, టీ తోటలు చూడదగినవి. ఇక్కడ ఇడుక్కి ఆనకట్ట, వాగమోన్, టీ తోటలు, వన్యప్రాణుల అభయారణ్యం అన్వేషించవచ్చు.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

నాగాలాండ్‌లోని ఖోనోమాను సందర్శించండి ఖోనోమాను భారతదేశంలోని మొట్టమొదటి పచ్చని గ్రామంగా పరిగణిస్తారు. ఖోనోమా గ్రామం దీని అందంతో మాత్రమే కాదు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు అడవులను చాలా జాగ్రత్తగా చూస్తుంటారు. ఇక్కడ టెర్రస్ వ్యవసాయం, నాగ సంస్కృతి, సాంప్రదాయ నిర్మాణ శైలిని అన్వేషించవచ్చు. వర్షాకాలంలో తేలికపాటి వర్షంలో ఇక్కడ పచ్చదనం, జానపద సంస్కృతి సంగమం కనిపిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)