AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..

హిందూ మతంలో దేవతల రాజు, స్వర్గానికి అధిపతి ఇంద్రుడు. ఇతడిని దేవేంద్రుడు అని కూడా పిలుస్తారు. ఋగ్వేదంలో ఇంద్రుడు చాలా ముఖ్యమైన దేవుడు. పురాణాల్లో ఇంద్రుడి శరీరంపై వేల కళ్ళు ఉన్నాయని ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇంద్రుడిని వేల కళ్ళతో చూపించారు. అయితే ఇంద్రుడికి ఎందుకు శరీరం నిండా కళ్ళు ఉన్నాయి? ఏ శాపం కారణంగా శరీరంపై వేల కళ్ళు ఏర్పడ్డాయి. దీని వెనుక ఉన్న పురాణ కథను ఈరోజు తెలుసుకుందాం..

Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
Indrudu
Surya Kala
|

Updated on: Jul 10, 2025 | 3:25 PM

Share

పురాణాల్లో ఇంద్రుడు స్వర్గంలో నివసించే ప్రస్తావన ఉంది. స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి వంటి వేలాది అప్సరసలతో నివసిస్తున్నాడని చెబుతారు. ఇంద్రుడు ఎక్కువగా ఇంద్ర భోగములలో మునిగి ఉంటాడని చూపబడింది. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. దీనిని బ్రహ్మవైవర్త పురాణం, పద్మ పురాణాలలో ప్రస్తావించారు. పద్మపురాణం ప్రకారం ఇంద్రుని శరీరంపై ఉండే వెయ్యి కళ్ళు గౌతమ రుషి శాపం వల్ల వచ్చాయని.. అయితే మొదట్లో అవి కళ్ళు కావు, వెయ్యి యోనిలు. తరువాత అవి కళ్ళుగా మారాయని చెబుతారు. దీని వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం.

వెయ్యి కళ్ళ వెనుక ఉన్న పురాణ కథ ఏమిటంటే ఈ పౌరాణిక కథ బ్రహ్మవైవర్త పురాణం, పద్మ పురాణం రెండింటిలోనూ ప్రస్తావించబడింది. అహల్య గౌతమ ఋషి భార్య. ఆమెకు శాశ్వతంగా యవ్వనంగా ఉండే వరం లభించింది. ఆమె అత్యంత సౌందర్యవతి. ఒకసారి ఇంద్రుడు భూమిపై పర్యటనకు బయలుదేరినప్పుడు.. అతను గౌతమ గుడిసె వెలుపల ఉన్న ఒక అందమైన స్త్రీని చూసి ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. తరువాత ఆమె గౌతమ ఋషి భార్య అని అతనికి తెలిసింది, అయినప్పటికీ ఇంద్రుడు అహల్య దేవి వైపు ఆకర్షితుడయ్యాడు. దీని కోసం అతను ఒక ప్రణాళిక వేశాడు.. చంద్రుని సహాయంతో వాతావరణాన్ని ఉదయంలా కనిపించేలా చేశాడు. చంద్రుడు కోడిగా మారి కోడి కూత కూశాడు. గౌతమ ఋషి సూర్యోదయం సమయంలో పూజ కోసం బయటకు వెళ్లేవాడు. కోడి కూత విన్న గౌతమ ఋషి ఉదయం అయిందని భావించి తన గుడిసే నుంచి నది వైపు బయలుదేరాడు. గౌతమ ఋషి తన గుడిసె నుంచి బయటకు వెళ్ళిన వెంటనే ఇంద్రదేవుడు గౌతమ ఋషిగా మారి మారువేషంలో అహల్య దేవిని ప్రేమ కోసం ఆహ్వానించాడు.

ఇంద్రుడికి గౌతమ రిషి శాపం ఇంతలో నది వద్దకు చేరుకున్న గౌతమ రుషికి నదిని చూశాడు. ఇంకా సూర్యోదయం కాలేదని.. రాత్రి ఉందని భావించాడు. తాను పొరపాటు పడ్డట్లు భావించి గౌతమి రుషి తన గుడిసెకు తిరిగి వచ్చాడు. అక్కడ అహల్య, ఇంద్రుడు కలిసి ఉండడం చూశాడు.. అప్పుడు ఆగ్రహంతో తన భార్య అయిన అహల్య దేవిని రాయిగా మారమని శపించాడు. ఆ తరువాత గౌతమ రుషి తన దివ్య దృష్టితో ఇంద్రుడి పన్నిన ఉపాయం అని తెలుసుకున్నాడు. దీంతో ఇంద్రుడిని కూడా శపించాడు.. ఏ యోని కోసం ధర్మాన్ని వదిలి భ్రష్టుడైపోయావో.. ఆ యోని నీ శరీరంపై కనిపించాలని.. వెయ్యి యోనిలతో శరీరం నిండిపోవాలని శపించాడు.

ఇవి కూడా చదవండి

సూర్యభగవానుని గురించి ఇంద్రుడు తపస్సు గౌతమి మహర్షి తాను చేసిన తప్పుని క్షమించమని ఇంద్రుడు కోరాడు. అయితే గౌతమ ఋషి అతడిని క్షమించలేదు. దీంతో ఇంద్రుడు తన శాపం నివారణ కోసం సూర్య భగవానుడిని తపస్సు చేశాడు. తన శాపం నుంచి విముక్తి చేయాలనీ అయితే సూర్యుడు గౌతమ రుషి ఇచ్చిన శాపాన్ని నేను నివారించలేను.. కానీ శరీరం మీద ఉన్న యోనిని కళ్ళుగా మార్చగలను అని సూర్య దేవుడు చెప్పాడు. ఆ తరువాత ఇంద్రుని శరీరంలోని యోనులు కళ్ళుగా మార్చాడు.

అహల్య దేవికి శాపం నుంచి విముక్తి గౌతమ రుషి జరిగిన దానిలో అహల్య దేవి తప్పు లేదని అర్థం చేసుకున్నాడు. అయితే తన శాపాన్ని తిరిగి తీసుకోలేకపోయాడు. అయితే రాయి అయిన అహల్యకు శాపం నుంచి విముక్తి స్వయంగా విష్ణువు ద్వారా లభిస్తుందని గౌతమి రుషి అహల్య దేవికి వరం ఇచ్చాడు. కాల క్రమంలో శ్రీరాముడు పాదాలు రాయిని తాకగా.. అహల్యంగా మారి శాపం నుంచి విముక్తి పొందాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.