Oats Cutlet: బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ స్నాక్ ఓట్స్ కట్లెట్.. సింపుల్ గా చేసుకోండి.. రెసిపీ మీ కోసం
ఓట్స్ రుచికరంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఓట్స్ లో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ బెస్ట్ ఎంపిక. ఈ ఓట్స్ తో రకరకాల ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. పిల్లలకు టిఫిన్‌లో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో ఆరోగ్యకరమైన ఆహరాన్ని ఇవ్వాలనుకుంటే ఓట్స్ కట్లెట్ మంచి ఎంపిక. ఇది తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రెసిపీ మీ కోసం

Oats Cutlet Recipe
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఆరోగ్యకరమైన, రుచికరమైన స్నాక్ కోసం చూస్తున్నట్లయితే.. ఓట్స్ కట్లెట్ గొప్ప ఎంపిక. ఈ ఓట్స్ కట్లెట్ రుచికరంగా ఉంటాయి. అంతేకాదు దీని తయారీకి ఉపయోగించే ఓట్స్, కూరగాయలు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఓట్స్ కట్లెట్ ప్రత్యేకత ఏమిటంటే దీనిని తక్కువ నూనెలో పాన్ మీద వేయించి కూడా తయారు చేసుకోవచ్చు, ఇది పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఓట్స్ కట్లెట్ తయారు చేయడానికి సులభమైన రెసిపీ ఉంది. తయారీ విధానం తెలుసుకుందాం.
ఓట్స్ కట్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు
- ఓట్స్ – 1 కప్పు (మెత్తగా రుబ్బుకోవాలి)
- బంగాళాదుంపలు – 2 మీడియం సైజు (ఉడికించి గుజ్జు చేసినవి)
- క్యారెట్ – 1 తురిమినది
- కాప్సికమ్ – సగం సన్నగా తరిగినది
- పచ్చి బఠానీలు – 1/4 కప్పు(ఉడికించినవి)
- పచ్చిమిర్చి – 1 సన్నగా తరిగినది
- అల్లం – 1 టీస్పూన్ తురిమినది
- కొత్తిమీర – సన్నగా తరిగినవి
- కారం – అర టీస్పూన్
- గరం మసాలా – అర టీస్పూన్
- చాట్ మసాలా – అర టీస్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- బ్రెడ్ ముక్కలు – 1/2 కప్పు (బైండింగ్ కోసం)
- నూనె – కట్లెట్స్ వేయించడానికి
ఇవి కూడా చదవండి
తయారీ విధానం:
- ముందుగా ఓట్స్‌ను పాన్‌లో వేసి వాటిని తేలికగా వేయించాలి. తేలికపాటి వాసన వచ్చే వరకూ వేయించి వాటిని చల్లార్చుకోవాలి. తర్వత వాటిని మిక్సర్‌లో వేసి ముతకగా గ్రైండ్ పట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించి మెత్తగా చేసిన బంగాళాదుంపలను తీసుకుని, దానికి తురిమిన క్యారెట్లు, క్యాప్సికమ్, ఉడికించిన బఠానీలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేయండి.
- తర్వాత కారం, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు , గ్రైండ్ చేసిన ఓట్స్ జోడించండి. మిక్స్ చేయండి. మిశ్రమం కొద్ది పల్చగా అనిపిస్తే, బ్రెడ్ ముక్కలు వేసి కలపండి.
- ఇలా తయారుచేసిన మిశ్రమాన్ని తీసుకుని నచ్చిన సైజులో కట్లెట్స్ తయారు చేసుకోండి. అంటే పిండిని గుండ్రంగా లేదా ఓవల్ ఆకారంలో చేసుకోండి.
- ఒక పాన్ తీసుకుని గ్యాస్ స్టవ్ మీద పెట్టి పాన్ మీద కొంచెం నూనె వేసి వేడి చేసి.. ఇప్పుడు రెడీ చేసుకున్న కట్లెట్స్ పెట్టి.. రెండు వైపులా మీడియం మంట మీద బంగారు గోధుమ రంగులోకి వచ్చి క్రిస్పీగా మారే వరకు వేయించండి.
- అంతే క్రిస్పీ క్రిస్పీ ఓట్స్ కట్లెట్ రెడీ. గ్రీన్ చట్నీ, చింతపండు చట్నీ లేదా టమోటా సాస్‌తో వేడి వేడిగా వడ్డించవచ్చు. పిల్లలు, పెద్దలు వీటిని ఇష్టంగా తింటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








