చికిత్స పొందుతూ ఆర్మీ మేజర్ మృతి

దక్షిణ కశ్మీర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ మేజర్‌ కేతన్‌ శర్మ మృతి చెందారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆర్మీ జవాన్లను చూసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు ఆర్మీ మేజర్ అధికారులు కాగా, మరో ఇద్దరు జవాన్లు […]

చికిత్స పొందుతూ ఆర్మీ మేజర్ మృతి
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 18, 2019 | 6:35 PM

దక్షిణ కశ్మీర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ మేజర్‌ కేతన్‌ శర్మ మృతి చెందారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆర్మీ జవాన్లను చూసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు ఆర్మీ మేజర్ అధికారులు కాగా, మరో ఇద్దరు జవాన్లు ఉన్నారు. వెంటనే వీరిని స్థానిక ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ.. ఆర్మీ మేజర్ కేతన్ శర్మ ప్రాణాలు విడిచారు. ఆయన మృతికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నివాళులు అర్పించారు.