శ్రీశైలం వాటర్‌ వార్‌లో ట్విస్ట్‌.. కేఆర్ఎంబీకి ఏపీ కంప్లైంట్‌.. ఇంతవరకు స్పందించని తెలంగాణ..

శ్రీశైలంపై మళ్లీ జగడం మొదలైంది. రెండు రాష్ట్రాలూ పవర్‌ జనరేషన్‌ చేస్తున్నా, తెలంగాణపై KRMBకి కంప్లైంట్‌చేసి వాటర్‌ వార్‌కి తెరలేపింది ఏపీ. ఇంతకీ, శ్రీశైలం పవర్‌ సెంటర్‌లో ఏం జరుగుతోంది?

శ్రీశైలం వాటర్‌ వార్‌లో ట్విస్ట్‌.. కేఆర్ఎంబీకి ఏపీ కంప్లైంట్‌.. ఇంతవరకు స్పందించని తెలంగాణ..
Srisailam Dam
Follow us
Venkata Chari

|

Updated on: Oct 02, 2022 | 6:30 AM

ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ జల జగడం రాజుకుంది. తెలంగాణపై మరోసారి KRMBకి కంప్లైంట్‌ చేసింది ఆంధ్రప్రదేశ్‌. నాగార్జునసాగర్‌కు నీటి అవసరాలు లేకపోయినప్పటికీ, శ్రీశైలంలో పవర్‌ జనరేషన్‌ చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తోందని ఫిర్యాదు చేసింది. ఒకవైపు, శ్రీశైలానికి ఇన్‌ఫ్లో తగ్గిపోవడం, మరోవైపు విద్యుదుత్పత్తి చేస్తుండటంతో జలాశయంలో నీటిమట్టం శరవేగంగా పడిపోతోంది. అయితే, KRMBకి ఏపీ కంప్లైంట్‌చేసి రెండ్రోజులవుతున్నా, ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్‌ రియాక్ట్‌ కాకపోవడమే ఆసక్తికరంగా మారింది. ఒకవైపు శ్రీశైలంలో ఏపీ పవర్‌ జనరేషన్‌ చేస్తూనే, మరోవైపు తెలంగాణపై KRMBకి కంప్లైంట్‌ చేయడంపై సీరియస్‌గా రియాక్టయ్యే అవకాశం కనిపిస్తోంది.

అయితే, ఏపీ వాదన మరోలా ఉంది. శ్రీశైలంలో రెండు రాష్ట్రాలూ పవర్‌ జనరేషన్‌ చేస్తున్నప్పటికీ, తన వాటాకి మించి తెలంగాణ వాడుకుంటోందని ఆంధ్రా అంటోంది. విద్యుదుత్పత్తిని చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తూ పెద్దమొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు, నాగార్జునసాగర్‌కు నీటి అవసరాలు లేని టైమ్‌లో పవర్‌ జనరేషన్‌ చేయడాన్ని ఆంధ్రా తప్పుబడుతోంది. మరి, ఏపీ కంప్లైంట్‌పై తెలంగాణ ఎప్పుడు రియాక్టవుతుందో? ఎలాంటి రియాక్షన్‌ ఇస్తుందోనన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రజెంట్‌ సీన్‌ చూస్తుంటే మాత్రం ఏపీ, తెలంగాణ మధ్య జలజగడం మళ్లీ ముదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయ్‌.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!