ఏపీలో.. ఉన్నత విద్యారంగంలో.. కీలక సంస్కరణలు..!

ఆధునిక సాంకేతికత కొత్తపుంతలు తుక్కుతున్న నేపథ్యంలో.. ఉన్నత విద్యారంగాన్ని పరిపుష్టం చేయడంలో భాగంగా ప్రత్యేక ప్రణాళిక మండలిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని

  • Tv9 Telugu
  • Publish Date - 2:05 pm, Sat, 15 August 20
ఏపీలో.. ఉన్నత విద్యారంగంలో.. కీలక సంస్కరణలు..!

AP Government Initiatives: ఆధునిక సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో.. ఉన్నత విద్యారంగాన్ని పరిపుష్టం చేయడంలో భాగంగా ప్రత్యేక ప్రణాళిక మండలిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని కేంద్ర విద్యాసంస్థల ప్రముఖులు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఇతర విద్యావేత్తలతో ఈ బోర్డు ఏర్పాటు కానుంది. సీఎం జగన్ సూచనల మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేశారు.

కరోనా సంక్షోభ సంమయంలోనూ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న సీఎం జగన్ సూచనల ప్రకారం.. రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు అక్రిడిటేషన్‌ పొందడమే లక్ష్యంగా బోర్డు పని చేస్తుంది. మెంటార్లుగా వ్యవహరిస్తూ న్యాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్, ఎన్‌బీఏతో సహా ఇతర ప్రఖ్యాత సంస్థల గుర్తింపు కోసం బోర్డు సహకారం అందిస్తుంది. విద్యాసంస్థలకు వనరులు, మౌలిక సదుపాయాలు, అభ్యాసన వ్యవస్థలు, ఉత్తమ పద్ధతులు, వినూత్న బోధనా విధానాలతో ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం బోర్డు లక్ష్యం. రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా బోర్డు మార్గనిర్దేశం చేస్తుంది.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!