కరోనా సంక్షోభంలోనూ.. ఊపందుకున్న కార్ల విక్రయాలు..!
దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కాగా.. కరోనా సంక్షోభంలోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కార్ల విక్రయాల జోరు కొనసాగింది. యూపీలో ఒక్క జులై నెలలోనే
దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కాగా.. కరోనా సంక్షోభంలోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కార్ల విక్రయాల జోరు కొనసాగింది. యూపీలో ఒక్క జులై నెలలోనే కొత్త కార్ల రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి రూ.387.53 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త కార్ల రిజిస్ట్రేషన్ ఆదాయంలో యూపీ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని రవాణశాఖ కమిషనర్ ధీరజ్ సాహు చెప్పారు. జులై నెలలో 1,96,086 కార్లు,ద్విచక్రవాహనాలు, 5,442 కమర్షియల్ ట్రక్కులు, బస్సుల రిజిస్ట్రేషన్ జరిగింది.
కార్ల విక్రయాలు ఉత్తరప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ జోరందుకున్నాయి. కొత్త కార్ల రిజిస్ట్రేషన్ వల్ల మహారాష్ట్రకు రూ.347.12కోట్లు, కర్ణాటకకు రూ.320.12కోట్లు, తమిళనాడుకు రూ.281.49కోట్లు, రాజస్థాన్ కు రూ.278.01 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా సంక్షోభంలోనూ ప్రజలు కొత్త కార్లు కొనేందుకు ముందుకు వస్తున్నారని తేలింది. కొత్త కార్లు, ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్ల వల్ల వచ్చిన ఆదాయం చూస్తే కరోనా ప్రభావం వీటి కొనుగోళ్లపై లేదని వెల్లడైంది.
Read More:
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!