ర‌ష్యా వ్యాక్సిన్ కొనుగోలు చేయ‌నున్న వియత్నాం !

రష్యన్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయడానికి వియత్నాం రిజిస్ట్రేషన్ చేసుకున్న‌ట్లు ఆ దేశ‌ స్టేట్ టెలివిజన్ శుక్రవారం తెలిపింది.

ర‌ష్యా వ్యాక్సిన్ కొనుగోలు చేయ‌నున్న వియత్నాం !
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 15, 2020 | 2:08 PM

రష్యన్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయడానికి వియత్నాం రిజిస్ట్రేషన్ చేసుకున్న‌ట్లు ఆ దేశ‌ స్టేట్ టెలివిజన్ శుక్రవారం తెలిపింది. లోక‌ల్ వ్యాప్తి ఆగిపోయి చాలా నెలలు గడిచిన తరువాత తాజాగా అక్క‌డ కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

రెండు వారాల వ్యవధిలో ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నట్లు రష్యా బుధవారం తెలిపింది. పెద్ద ఎత్తున ట్రయల్స్ పూర్తి చేయ‌కుండా ఈ వ్యాక్సిన్ రిలీజ్ చేస్తున్నార‌న్న కొన్ని దేశాల వాద‌న‌ను ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కొట్టిపారేశారు. త‌మ వ్యాక్సిన్ చాలా స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుందని హామి ఇస్తున్నారు. 50-150 మిలియన్ వ్యాక్సిన్ డోస్‌లు దిగుమ‌తి చేసుకునేందుకు వియత్నాం అగ్రిమెంట్ చేసుకున్న‌ట్లు టువోయ్ ట్రె వార్తాపత్రిక తెలిపింది. కొన్ని డోస్‌ల‌ను ర‌ష్యా విరాళంగా ఇస్తుంద‌ని, మిగిలిన వాటికి వియత్నాం డ‌బ్బు చెల్లిస్తుంద‌ని స‌ద‌రు ప‌త్రిక పేర్కొంది. మ‌రోవైపు సొంత వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు కూడా వియత్నాం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. వియత్నాంలో మొత్తం 911 క‌రోనా వైర‌స్ నమోదయ్యాయి, 21 మంది మరణించారు.

Also Read : కరోనా టీకాపై ప్రధాని మోదీ స్ప‌ష్ట‌త‌