కాఫీ.. చాలా మందికి ఇది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. ఓ ఎమోషన్. ఇదొక ఎనర్జీ డ్రింక్! భోజనం తర్వాత ఆవరించే మగతను వదిలించుకోవడానికి మొదటి చాయిస్ కాఫీనే
TV9 Telugu
పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి, మైండ్ రిఫ్రెష్‌కు చాలామందికి కాఫీనే ఆలంబనం. అయితే కాఫీ ప్రియులకు తాజాగా సైన్స్ మరో తీపి కబురు చెప్పింది
TV9 Telugu
రోజూ కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో మతిమరుపు వచ్చే అవకాశాలు తక్కువట. తాజాగా జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది
TV9 Telugu
దాదాపు 37 ఏళ్ల పాటు సుమారు 1.3 లక్షల మంది ఆరోగ్య అలవాట్లను పరిశీలించి పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు మందగిస్తుంది
TV9 Telugu
వయసు మీద పడటం వల్ల ఆలోచనా సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఇలాంటి న్యూరో డీజెనరేటివ్ సమస్యలను ఎదురోవడంలో కెఫీన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వీరి అధ్యయనంలో వెల్లడైంది
TV9 Telugu
అయితే ఈ ప్రయోజనాలన్నీ కేవలం కెఫీన్ ఉన్న కాఫీ లేదా టీ తాగినప్పుడే కనిపిస్తున్నాయట. కెఫీన్ లేని కాఫీ తాగిన వారిలో ఇలాంటి మార్పులేవీ కనిపించలేదని పరిశోధకులు గుర్తించారు
TV9 Telugu
కాఫీ తాగని వారితో పోలిస్తే, రోజూ పరిమితంగా తాగే వారికి జ్ఞాపకశక్తి సమస్యలు తక్కువగా ఉన్నాయని, వీరు కాగ్నిటివ్ పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచారని ఈ నివేదిక వెల్లడించింది
TV9 Telugu
అయితే కాఫీ మంచిది కదాని గంటకో కప్పు తాగేస్తే మాత్రం ప్రయోజనానికి బదులు అపార నష్టం వాటిల్లుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీతోపాటు జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి