ఏపీ : సచివాలయ ఆరోగ్య మిత్రలుగా ఏఎన్ఎంల నియామకం

ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు సచివాలయ ఆరోగ్య సహాయకులను సచివాలయ ఆరోగ్య మిత్రలుగా నియమిస్తూ ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ : సచివాలయ ఆరోగ్య మిత్రలుగా ఏఎన్ఎంల నియామకం
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 21, 2020 | 9:00 PM

ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు సచివాలయ ఆరోగ్య సహాయకులను సచివాలయ ఆరోగ్య మిత్రలుగా నియమిస్తూ ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశాలన్నీ సచివాలయ ఆరోగ్య మిత్రలు మోనేట‌ర్ చేస్తార‌ని గ‌వ‌ర్న‌మెంట్ ఉత్తర్వుల్లో వెల్ల‌డించింది. ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓ సిఫార్సుల మేరకు వైద్యారోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

సచివాలయ ఆరోగ్య మిత్రల విధులు

  • రోగుల దరఖాస్తులను పరిశీలించి ఆన్​లైన్ పోర్టల్​లో నమోదు చేయాలి
  • ఆరోగ్యశాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
  • ఆరోగ్య శ్రీ నెట్​వర్క్​ ఆస్పత్రులకు లబ్ధిదారులను పంపించాలి
  • నగదు రహిత చికిత్సకు సహకరించాలి
  • రోగులకు ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలి
  • ఆరోగ్య క్యాంపుల్లో పాల్గొనాలి

ఈ కార్యకలాపాలకు సంబంధించి సచివాలయ ఆరోగ్య మిత్రలు, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు జిల్లా కోఆర్డినేటర్లకు రిపోర్టు చేయాల్సిందిగా స‌ర్కార్ ఆదేశించింది. అదే క్ర‌మంలో నూతనంగా జారీ చేసిన ఈ మార్గదర్శకాలతో పాటు… ఆరోగ్యశ్రీ నెట్​వర్క్ ఆస్పత్రుల జాబితాను కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాల్సిందిగా వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Also Read :

ఎస్పీ బాలు కోసం శబరిమలలో ప్ర‌త్యేక పూజ‌లు, సంగీత సమర్పణ

మ‌రో గంటలో పెళ్లన‌గా, వరుడు ఆత్మహత్యాయత్నం