అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నోటిఫికేషన్ విడుదల
రాష్ర్ట అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలయ్యింది. వచ్చే నెల 7 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి.
రాష్ర్ట అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలయ్యింది. వచ్చే నెల 7 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా తాజా సెషన్‌ను నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకుంది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర అధికారులు అసెంబ్లీ సమావేశ మందిరం ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపులపై ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రతఒక్కరు భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజేషన్, ఇతర ముందు జాగ్రత్త చర్యలను నిర్ధారించడానికి ఇప్పటికే చర్యలను చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలో సందర్శకుల ప్రవేశాన్ని పరిమితం చేయడాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు త్వరలోనే నివేదికను సమర్పించనున్నారు.