బాబు డైరెక్షన్‌లో రఘురామకృష్ణరాజు
వినాయక చవితి ఉత్సవాలపై ప్రతిపక్షాలు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేయడం బాధాకరమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు
Vellampalli comments on YCP MP: వినాయక చవితి ఉత్సవాలపై ప్రతిపక్షాలు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేయడం బాధాకరమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసమే గణేష్ ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిందని అన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మాట్లాడారు. కరోనా నుంచి ప్రజలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. పండితులు, మత పెద్దలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వైరస్ కారణంగా మార్చి నుంచి ఇంతవరకు జరిగిన పండగలను ఇళ్లలోనే చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని సూచించారు.
గత ఐదు నెలలుగా ఎంపీ రఘురామకృష్ణరాజు తన సొంత నియోజకవర్గానికి కూడా రాలేదని వెల్లంపల్లి విమర్శించారు. ఢిల్లీలో కూర్చొని మాట్లాడటం కాదని, అంత ప్రేమ ఉంటే నియోజకవర్గానికి వచ్చి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనాలని తెలిపారు. చంద్రబాబు డైరెక్షన్‌లో చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Read More: